ఈ మద్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోతుంది.  బాలీవుడ్, మాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు హీరోయిన్లు తెలుగులో నటించి మంచి విజయాలు అందుకుంటున్నారు.  గత యేడాది అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా మంచి విజయం సాధించడమే కాదు..పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది.  ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి..హీరోగా కార్తికేయ వరుస ఛాన్సులు వచ్చాయి.  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పూత్ బోల్డ్ నటనకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. 
Related image
ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లు బాగా ఉండటంతో పాయల్ రాజ్ పూత్ కుర్రాళ్ల మనసులో కలల రాణిగా మిగిలిపోయింది.  ప్రస్తుతం పాయల్ కి తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి.  తాజాగా పాయల్ రాజ్ పూత్, కింగ్ అక్కినేని నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో నాగార్జున కెరీర్ లో మంచి సక్సెస్ సాధించిన సినిమా ‘మన్మథుడు’.
Related image
విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.  గత కొంత కాలంగా ఈ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారట...మొత్తానికి ఆయన కల నెరవేర్చుకుంటున్నారు.  నాగార్జున హీరోగా,  ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు.
Image result for nagarjuna payal raj put
రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన పాయల్ ఇప్పుడు నాగార్జున సరసన తగిలిన ఛాన్స్ ఆమె కెరియర్ మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: