ఈ మద్య కొంత మంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు.  ప్రకృత్తి విపత్తులు సంబవించినపుడు పోటీ పడుతూ తమ వంతు సహాయాన్ని అందించడమే కాదు తమ ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  కొంత మంది హీరోలు అయితే పర్సనల్ గా తమ అభిమాను వద్దకు వెళ్తూ వారి కష్టాలు తీరుస్తు..సంతోష పెడుతున్నారు.  తమ అభిమాను ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. 

తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి  ప్ర‌స్తుతం త‌మిళంలో ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో సైరా అనే చిత్రంలోను న‌టిస్తున్నాడు. ఈ మద్య రజినీకాంత్ నటించిన కాలా సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాడు.   న‌టుడిగానే కాకుండా మంచి మాన‌వ‌తా వాదిగా ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న విజ‌య్ సేతుప‌తి త‌న మూవీ సెట్‌కి వ‌చ్చిన ఓ న‌టికి ఆర్ధిక సాయం చేశాడు.

ప్రస్తుతం  శీను రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మామనిథాన్ సినిమా షూటింగ్‌లో ఉండగా.. గతంలో కొన్ని సినిమాలలో నటించిన కవలమ్ అచ్చమ్ అనే వృద్ధురాలు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటూ విజయ్‌ను వచ్చి కలిసింది.  ఆమె పరిస్థితి చూసిన విజయ్ సేతుపతి వెంటగనే చలించిపోయాడు..ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన ఆమెకి కొంత న‌గ‌దు అందించాడు.

దాంతో ఆమె సంతోషం వ్య‌క్తం చేసింది.  కవలమ్ డబ్బు తీసుకుని వెళుతుండగా దారిలో స్పృహ కోల్పోయి పడిపోయింది.  అక్కడ ఉన్నవారు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. కవలమ్ గతంలో మలయాళం సినిమాల్లో నటించిందని తెలుస్తోంది.  ప్రస్తుతం  కవలమ్‌కు విజయ్ సాయమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: