రకుల్ ప్రీతీ సింగ్ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలా సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను త్వరగానే అందుకున్నది. అయితే వరుసగా అమ్మడికి ఫ్లాప్స్ రావటంతో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు తెలుగు లో సైన్ చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. పోనీ హిందిలో సెటిల్ అవుదామని అయారి మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అదీ డిజాస్టర్ అయ్యింది. అందుకే కోలీవుడ్ లో జెండా నాటే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.

Image result for rakul preet singh

గత ఏడాది కార్తి సరసన చేసిన ఖాకీ తనకు అక్కడ మంచి పేరు తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మాత్రమే కనిపించే పాత్రే అయినప్పటికీ అక్కడి ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ జోష్ తోనే అదే కార్తితో దేవ్ చేసిన రకుల్ ఇప్పుడు దాని రిలీజ్ డేట్ అయిన ఫిబ్రవరి 14 కోసం ఎదురు చూస్తోంది. అడ్వెంచర్లు చేసే హీరోతో ప్రేమలో పడే ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా రకుల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని యూనిట్ టాక్. అందుకే దీని మీద తనకు చాలా హోప్స్ ఉన్నాయి.

Image result for rakul preet singh

పెద్దగా హడావిడి లేకుండా దేవ్ సైలెంట్ గా వస్తున్నాడు. నిన్న విడుదలైన ట్రైలర్ ఓ మాదిరిగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఏదో విషయం ఉందనే ఇంప్రెషన్ అయితే ఇవ్వగలిగింది. హరీష్ జైరాజ్ సంగీతంతో పాటు రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ మొత్తానికి దేవ్ మీద నమ్మకం కలిగేలా చేసాయి. ఇది హిట్ అయితే తెలుగు తమిళ్ లో రెండింటిలో ఎక్కడో ఒక చోట మంచి ఆఫర్లు వస్తాయని రకుల్ ఆలోచన. మరో హింది సినిమా కూడా చేస్తోంది కాని రకుల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు సౌత్ మీదే ఉంది. కొత్త హీరొయిన్ల తాకిడి ఎంత ఉన్నా గట్టిగా ఓ రెండు హిట్లు పడితే కాజల్ అగర్వాల్ లా మళ్ళి ఫాం లోకి రావోచ్చనే ఆలోచన రకుల్ కు ఉండొచ్చు. మరి అది ఎంత వరకు నెరవేరుతుందో ప్రేమికుల రోజున తేలిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: