‘వినయ విధేయ రామ’ ఊహించని విధంగా ఫ్లాప్ అయినా ఆవిషయాలను పట్టించుకోకుండా రామ్ చరణ్ కియారా అద్వానితో కలిసి పాల్గొన్న రానా ‘నెంబర్ 1 యారి’ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భoలో చరణ్ ఊహించని విధంగా కియారా అద్వాని పై చేసిన కామెంట్స్ ఆమెను అవమాన పరిచినట్లుగా ఉన్నాయి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.  
Charan’s Funny Reply To Rana on No. 1 Yaari Show  
ఈ షోను నిర్వహిస్తున్న రానా చరణ్ వంక చూస్తూ ‘నువ్వు నాకన్నా చిన్న వాడివా పెద్ద వాడివా’ అని అడుగుతూ చరణ్ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. దానికి చరణ్ నవ్వుతూ తన వయసు తనకే తెలియదు అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. 
Ram Charan, Rana And Kiara Advani Stills From No.1 Yaari With Rana
వాస్తవానికి రామ్ చరణ్ రానా కన్నా కొద్దిగా చిన్నవాడు మాత్రమే కాదు వారిద్దరూ చదువుకున్న స్కూల్ లో రానా చరణ్ కు సీనియర్. అయితే రానా పరీక్షలలో ఫెయిల్ అవ్వడంతో ఆతరువాత చరణ్ కు క్లాస్ మెట్ గా మారిపోయాడు. ఇలా ఎన్నో విషయాలు వారిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో వారిద్దరి మాటలు ఆకార్యక్రమానికి చరణ్ తో కలిసి వచ్చిన కియారా అద్వాని పై మళ్ళాయి.
Rana Chills Out With Buddies On  Birthday  
హీరోయిన్స్ ను ప్రశ్నలు వేస్తూ ఇరుకున పెట్టడంలో సమర్ధుడైన రానా కియారా వంక చూస్తూ ‘నీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఇష్టం?’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె తన బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ తనకు చాల ఇష్టం అన్న అనేక కారణాలు వివరిస్తూ తన మాతృ భాష హిందీ కన్నా తెలుగు భాష అంటే చాల ఇష్టం అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పింది. దీనితో షాక్ అయిన చరణ్ దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాల పేర్లు అక్కడ ప్రజలు మాట్లాడుకునే భాషల పేర్లు చెప్పమని నవ్వుతూ ప్రశ్నించాడు. అయితే ఈ చిన్న ప్రశ్నకు కూడ కియారా సమాధానం చెప్పలేక పోవడంతో ‘నువ్వు జనరల్ నాలెడ్జి లో వీక్ అనుకుంటా’ అంటూ చరణ్ జోక్ చేసేసరికి ఆ కార్యక్రమం అంతా సందడిగా మారిపోయింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: