ఇటీవల విడుదలైన వినయ విధేయ రామలో యాక్షన్ సీన్లు.. లాజిక్ లేని సన్నివేశాలు చాలా విమర్శలకు గురయ్యాయి. సోషల్ మీడియాలో వీటిపై తెగ జోకులు పేలాయి. ఈ సినిమా సీన్లు.. పలనాటి బ్రహ్మనాయుడిలోని బాలయ్య సీన్లను మరిపించాయని చాలామంది కామెంట్ చేశారు.



మరి ఇప్పుడు ఈ వినయ విధేయ రామ పుణ్యమో ఏమో కానీ.. బాలయ్య పాత సినిమాల్లోని క్లిప్పింగులు మరోసారి బయటకు వస్తున్నాయి. వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నది ఎవరనే విషయం తెలియదు కానీ ఆ వీడియోలు మాత్రం తెగ నవ్విస్తున్నాయి.



వీటిలో ఓ సీన్.. బాలయ్య జైల్లో ఉంటాడు.. హీరోయిన్ రజని అతన్ని చూసేందుకు వస్తుంది. అతడితో జైల్లో నుంచే తాళి కట్టించుకుంటుంది. ఎమోషన్ లో తాళి కట్టేసిన బాలయ్య చిన్నలాజిక్ మరిచిపోతాడు. దాంతో మాంగళ్యం జైలు ఊచలకూ రజనీ మెడకూ మధ్య చిక్కుకుంటుంది. రజని వెళ్లిపోదామంటే తాళి తెంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో తాళి తెంచేపని లేకుండా ఆ జైలు ఊచలను వంచేస్తాడు..



ఇలాంటిదే మరోసీన్.. ఇక్కడ హీరోయిన్ విజయశాంతి. విలన్లు బైక్ పై వెళ్తున్న బాలయ్య, విజయశాంతిలను చేజ్ చేస్తుంటారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాలయ్య.. ఓ పెద్ద గొడుగును ఓ చేత్తో పట్టుకుని బైక్ ను ఏకంగా వంతెన పైనుంచి నదిలోకి దూకిస్తాడు.. ఆ గొడుగు సాయంతో దూరంగా ఎక్కడో లాండవుతాడు. ఈ సీన్లు చూసి జనం భలే నవ్వుకుంటున్నారు. దటీజ్ బాలయ్య.


మరింత సమాచారం తెలుసుకోండి: