ఒక రాజకీయ పార్టీ నాయకుడుకు తాను ఎన్నికలలో పోటీ చేసే నియోజక వర్గ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ నాయకులు అంతా తాము పుట్టిన ప్రాంతాలలో ఉండే నియోజక వర్గాలలో పోటీ చేసి సులువుగా విజయం సాధిస్తూ ఉంటారు. 

రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అన్ని స్థానాలకు తన పార్టీ అభ్యర్దులను నిలబెడతాను అంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ తాను రాబోతున్న ఎన్నికలలో ఏ స్థానం నుండి పోటీ చేయాలి అన్న విషయం పై పడుతున్న కన్ఫ్యూజన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి పవన్ ఆలోచనలలో అనంతపూర్ తిరుపతి పాలకొల్లు ఏలూరు పిఠాపురంలు ఉన్నా ఈ 5స్థానాలలో తనకు ఏది సురక్షితం అన్న విషయంలో పవన్ ఎటూ నిర్ణయించుకో లేకపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ ఐదు ప్రాంతాలకు సంబంధించిన ఊళ్ళలలో పవన్ అభిమానులు పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చాలామంది ఉన్నా ఈ ఐదు ఊళ్ళల్లో పవన్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆర్ధికంగా సామాజిక పరంగా పవన్ కు గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్ధులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు టాక్. దీనికితోడు పవన్ కు తన సొంత ఊరు అయిన పాలకొల్లు ప్రాంతానికి చెందిన నరసాపురంలో మెగా ఫ్యామిలీకి పట్టులేక పోవడంతో పాటు స్వయంగా చిరంజీవి పాలకొల్లులో ఓడి పోయిన సంఘటనలను ఇప్పటికీ పవన్ మర్చిపోలేక పోతున్నాడని టాక్. 

ఇటువంటి పరిస్థుతులలో ఈ ఐదు ప్రాంతాలలో గతంలో చిరంజీవికి గెలుపును ఇచ్చిన తిరుపతిని ఎంచుకోవాలా లేదంటే ఇప్పటి వరకు వార్తలలోకి రాని మరొక ప్రాంతం వైపు అడుగులు వేయాలా అన్న కన్ఫ్యూజన్ పవన్ ను వెంటాడుతున్నట్లు టాక్. దీనితో పవన్ కు అనుకూలమైన ఒక మీడియా సంస్థ ద్వారా రహస్య సర్వేని చేయించినా ఎక్కడా స్పష్టమైన క్లారిటీ లభించకపోవడంతో పవన్ తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. దీనితో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను అంటూ ప్రకటనలు ఇస్తున్న పవన్ కు ఈ నియోజకవర్గ కష్టాలు ఏమిటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: