గత సంవత్సరం నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా పరాజయాలు ఎదుర్కున్న దిల్ రాజ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్ 2’ ద్వారా అందుకోవడంతో మంచి జోష్ లో ఉన్నాడు. అంతేకాదు అనేక సినిమాలు నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్స్ పై చర్చలు జరుపుతూ తన వేగాన్ని మరింత పెంచాడు.
బాలయ్య గురించి
ఇలాంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ ఇప్పటి వరకు తాను నిర్మించిన వివిధ సినిమాల హీరోల మనస్థత్వం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మొదటిగా మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి స్థాయిలో హార్డ్ వర్క్ చేసే హీరో మరెవ్వరూ లేరు అని కామెంట్ చేసాడు. 
రామ్ చరణ్ ఏం చేశాడంటే...
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ మంచితనంతో పాటు అతడు సిగ్గుపడే విషయం పరిశీలిస్తే నిజంగానే ఇతడు పవర్ స్టారా ? కాదా అనే అభిప్రాయం కలుగుతుందని అభిప్రాయ పడుతున్నాడు దిల్ రాజ్.  ఇక ఈసంవత్సరం తనకు కాసుల వర్షం కురిపిస్తున్న ‘ఎఫ్ 2’ హీరో వెంకటేష్ గురించి మాట్లాడుతూ వెంకీని తాను వ్యక్తిగతంగా చాల కోణాలలో చూశానని అయితే ఆవిషయాలు మాత్రం తాను చెప్పను అంటూ జోక్ చేసాడు. 
అల్లు అర్జున్ గురించి
చాలామంది టాప్ హీరోలతో తాను సినిమాలు తీసినా చాల స్మార్ట్ గా ఉండటమే కాకుండా మాట్లాడే మాటలలో చాల స్మార్ట్ గా సెటైర్లు వేయగల మహేష్ సమర్ధత ఏహీరోకి లేదు అంటూ మహేష్ ను టార్గెట్ చేస్తున్నాడు దిల్ రాజ్. అయితే ఎంతమంది హీరోలు ఉన్నా జూనియర్ తన పట్ల చూపించే అభిమానం ప్రత్యేకం అంటూ బాలకృష్ణ తనను ‘రాజు రెడ్డి’ అంటూ పిలిచే పిలుపులో బాలయ్యలోని అభిమానంతో పాటు అతడి దర్పం కూడ తనకు బాగా ఇష్టం అంటూ కామెంట్స్ చేసిన దిల్ రాజ్ ఇంటర్వ్యూ టాప్ హీరోల అభిమానులను ఆకర్షిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: