తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన భానుప్రియ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించన తర్వాత తల్లి పాత్రల్లో నటిస్తుంది.  తాజాగా భానుప్రియ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది.   ఈ మద్య భాను ప్రియ ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలిక తల్లి ప్రభావతి తన కూతురుని ఇబ్బందులు పెడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని కేసు పెట్టింది. ఈ విషయంపై భాను ప్రియ కూడా కేసు పెట్టడంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రభావతి తప్పుడు కేసు పెట్టినట్లు తేల్చారు. 

కానీ ఇప్పుడు భానప్రియ మరో సమస్యలో పడ్డట్టు సమాచారం. పోలీసులు ఆమెపై బాలలతో వెట్టిచాకిరీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 14 సంవత్సరాల బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా, ఆమెపై పోలీసు కేసు పెట్టిన ఘటనలో స్పందించిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు, భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  సదరు బాలిక తన ఇంట్లో పని చేస్తుందని స్వయంగా భానుప్రియ ఒప్పుకోవడం దానికి సంబంధించి వీడియోలు ఉండటంతో.. ఆమెపై కేసు బలంగా ఉంటుందని భావిస్తున్నారు.

మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకోవడం పెద్ద నేరమని, అంతేకాకుండా, ఆమెను లైంగికంగానూ వేధించారని ఆరోపణలు రావడంతో, అవి రుజువైతే భానుప్రియకు, ఆమె సోదరుడికి శిక్ష తప్పదని చెబుతున్నారు.  ఈ విషయంలో భానుప్రియను, ఆమె కుటుంబీకులను విచారించి, తదుపరి అడుగులు వేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: