ఎన్టీఆర్ వల్ల బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. మొదటి సీజన్ ఎన్టీఆర్ చేతిలో పడటం తో షో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇక బిగ్‌బాస్ సీజన్ 3 గురించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదటి రెండు సీజన్స్ సక్సెస్ కావడంతో మూడవ సీజన్ పై ఆసక్తి పెరుగుతోంది. బిగ్ బాస్ 3 ఇంకా వినోదాత్మకంగా, ఉత్కంఠ భరితంగా సాగుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి విజయవంతంగా నడిపించిన ఎన్టీఆర్ గురించి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. 

వదిలేలా లేరు

తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి తన సమయస్ఫూర్తితో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ గా నిలవడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడు. తెలుగు ఆడియన్స్ కు బిగ్ బాస్ ఆ సమయంలో కొత్త. ఆడియన్స్ అందరిని ఆకర్షిస్తూ షోని నడిపించడంలో ఎన్టీఆర్ విజయవంతం అయ్యాడు. కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ సంభాషణ కూడా ఆకట్టుకుంది. 

Image result for ntr

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కు బిగ్ బాస్ నిర్వాహకులు 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఇది సంచలనమే అని చెప్పొచ్చు. తెలుగులో నిర్వహించే ఓ రియాలిటీ షోకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం మామూలు విషయం కాదు. సీజన్ 3తో బిగ్ బాస్ షోకు మళ్ళీ ఎన్టీఆర్ తిరిగివస్తే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయని, షోకి మరింతగా క్రేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: