నందమూరి తారక రామారావు జీవనచిత్రం ఎన్టీఆర్ కథానాయకుని సినిమాలో ఎన్టీఆర్ సహధర్మచారిణి బసవతారకం పాత్రలో ఓదిగిపోయి నటించారు. ఆ సినిమాకే హైలైట్ గా నటించారు. విద్య సహజంగానే విద్యావంతురాలు. పాత్రను అర్ధం చేసుకొని ఆ స్వభావానికి అనుగుణంగా పరకాయప్రవేశం చేసి నటించి మెప్పించగల ధీమంతత ఉన్న పాతతరం నటీమణులకు సాటి రాగల నటి. అంతేకాదు నవ్యత్వాన్ని ఆపాత్రకు ఆపాదించగలరు కూడా! ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయంలేని మహానటుని సహధర్మచారిణి, బహుసంతానానికి మాతృమూర్తి, గొప్ప కుటుంబా నికి యజమానురాలైన బసవతారకం పాత్రలో నిర్వివాదంగా మరో మాటకు తావు లేకుండా ఒదిగి నటించారు. ఆ సినిమా ఎలా ఉన్నా బసవతారకంగారికే వన్నెతెచ్చారు విద్యాబాలన్.  

Image result for vidya as basavatarakam

ఈ భారతీయ నటి. భాష, ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేకుండా ఆమె అన్నీ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తన 14 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో భిన్నవిభిన్న పాత్రలు చేశారు. ఇటు మహిళా ప్రాధాన్య చిత్రాలకు, అటు కేలకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచారామె. అయితే హీరోయిన్‌ అనగానే సన్న జాజి తీగలానే ఉండాలనే నియమం విద్యాబాలన్‌ కు ఏ మాత్రం వర్తించదు. శరీరాకృతితో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఒక  మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో విద్య తన వ్యక్తి గత విషయాలు పంచుకున్నారు.

Related image

"నా చిన్నతనం నుంచి నాకు హార్మోన్‌ సమస్యలున్నాయి. దానివల్ల బరువు పెరుగుతున్నాను. నేను చాలా అందంగా ఉన్నానని, కానీ నా బరువు కాస్త తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంద ని నేను టీనేజ్‌ లో ఉన్నప్పుడు చాలామంది అనేవారు. శరీరబరువు తగ్గించు కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నేను వ్యాయామం చేయనని కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడితే ఊరుకోను. నేను వ్యాయామం చేయనని మీకు చెప్పానా? నా శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎంత కష్టపడతానో మీకు తెలుసా? అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తాను. గత కొన్నాళ్లుగా నా ఫొటోలను చూసుకోవడం మానేశాను. ఎందుకంటే వాటిని చూసినప్పుడల్లా ఇప్పుడు నేను ఇంకా బరువు పెరిగాననే బాధ నన్ను వేధిస్తుంది. అందుకే నా చిన్న నాటి ఫొటోలు చూసుకోవడం మానేశాను. ఇప్పుడు నేను బరువు తగ్గడం కంటే ముందు నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి" అని తెలిపారు.

Image result for vidya balan in shakuntala devi

వృత్తిపరంగా ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు శకుంతల దేవి జీవితం ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు. ఇందులో శకుంతలాదేవి కూతురి పాత్రలో మరో యువనటి సాన్యామల్హోత్రా నటించనుంది. మరో వైపు బాలీవుడ్‌ హిట్‌ చిత్రం పింక్ రీమేక్‌ మరియు ఏకే-59 అనే తమిళ సినిమాల్లోనూ  విద్యాబాలన్‌ నటించటానికి అంగీకరించి నట్లు తెలుస్తుంది.  

Image result for sanya malhotra in shakuntala devi's daughter

మరింత సమాచారం తెలుసుకోండి: