బాలీవుడ్ లో సీరియల్స్ లో నటించిన నటీమణులు తర్వాత హీరోయిన్లు గా రాణించారు.  పదహారేళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే హిందీ సీరియల్లో నటించిన విద్యాబాలన్ ‘పరిణితి’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత సంజయ్‌దత్ సరసన ‘లగే రహో మున్నాభాయ్‌’లో జాహ్నవిగా విద్యాబాలన్ కి మంచి పేరు వచ్చింది. మొదటి నుంచి బాలీవుడ్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్ ’హాట్ లుక్ తో అందరికీ షాక్ ఇచ్చింది. 
Vidya Balan at WWF World Earth Hour event, ITC Grand Maratha, Mumbai.jpg
ఆ సినిమాలో విద్యాబాలన్ గ్లామర్ కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. 2012 డిసెంబరులో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని వివాహమాడింది విద్య. పెళ్ళి తర్వాత వచ్చిన ఘన్‌చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ సినిమాలు ఫర్వాలేదనిపించాయి.  ఇటీవల క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించింది.  14 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు చేశారామె. ఇటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, అటు బరువైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 

మొదటి నుంచి శరీరాకృతితో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా చిన్నతనం నుంచి నాకు హార్మోన్‌ సమస్యలున్నాయి. అందుకే బరువు పెరుగుతున్నాను. నేను టీనేజ్ లో ఉన్న సమయంలో చాలా మంది సన్నబడితే బాగుంటుందని సలహా ఇచ్చేవారు.. నా శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. 
Image result for dirty pictures vidya balan
నేను వ్యాయామం, యోగ చేరని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు..నేను వ్యాయామం చేయనని మీకు చెప్పానా? నా శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎంత కష్టపడతానో మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.  గత కొన్నాళ్లుగా నా ఫొటోలను చూసుకోవడం మానేశాను.  నా బరువు గురించి ఎవరైనా ఇప్పుడు కామెంట్స్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది..అంతే కాదు నా విషయంలో ఇలాంటి కామెంట్స్ అనవసం అనిపిస్తుంది.   ఇప్పుడు నేను బరువు తగ్గడం కంటే ముందు నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: