తెలుగు చలన చిత్ర సీమలో బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ బాబు మూవీ భరత్ అను నేను. బయట అసలు రాజకీయాలు మాట్లాడడానికే ఇష్టపడని మహేష్ ఇందులో ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర వేశారు. ఈ యువ సీఎం జనం కోసం పడిన తపనతో జనం నోట్లు కొల్లగొట్టారు. ఫలితంగా కలెక్షన్ల పంట పండింది.


పసుపు శిబిరం వైపుగా :


ఇపుడు ఏపీలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. ఈసారి జరిగే ఎన్నికలు అలాంటి ఇలాంటి ఎన్నికలు కావు. ఓ వైపు వైసీపీ కసి మీద ఉంది. అధికారం ఈసారి ఎలాగైనా  పట్టాలని చూస్తోంది. మరో వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం జారవిడుచుకోవడానికి టీడీపీ ఇష్టపడం లేదు. ఈ నేపధ్యంలో  టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్  కలిగిన మహేష్ రాజకీయాల వైపు చూస్తారా. అయితే ఆయన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలని టీడీపీ కొత్త ఎత్తులను వేస్తోంది. 


బాబాయి బాటలో :


మహేష్ బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. దాంతో మహెష్ ని కూడా టీడీపీ కి అనుకూలంగా చేసుకోవాలని ఆ పాటీ ఎత్తుగడలు వేస్తోంది. మహేష్ బాబు కనుక ఓకే అంటే ఇటు పవన్ లేని లోటు, అటు జూనియర్ తారక్ రాని కొరత కూడా ఒకే మారు తీరుతాయని ఆ పార్టీ భావిస్తోంది. ఈ రోజు టీడీపీలో ఆదిశేషగిరిరావు చేరుతున్నారు. దాంతో ఆయన‌ ద్వారా గానీ, మహేష్ బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ద్వారా కానీ మహేష్ ని ఒప్పించాలను చూస్తున్నట్లుగా టాక్.


ఒప్పుకుంటాడా :


నిజానికి మహేష్ రాజకీయాలు బహు దూరం. ఆయన భరత్ అనే మూవీ చేయడమే పెద్ద షాక్. దాని మీద అప్పట్లో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ తనకు రాజకీయాలంటే ఏంటో తెలియదు అని చెప్పేశారు కూడా. ఇక ఆయన చేస్తే తన బావ జయదేవ్ కి ప్రచారం చేయవచ్చు. బాబాయి అడిగితే అటు వైపు వెళ్లవచ్చు. ఈ రెండు చోట్ల చేసినా కూడా ఆయన టీడీపీ వాడేనని చెప్పుకునేందుకు సైకిల్ పార్టీకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా సూపర్ స్టార్ క్రిష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తరువాత వైఎస్ కి మద్దతుగా నిలిచారు. జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇపుడు తమ్ముడు టీడీపీలో చేరాక ఆయన ఏమంటారో చూడాలి. మొత్తానికి క్రిష్ణ, మహేష్ అభిమానులను తిప్పుకునేందుకు టీడీపీ గట్టిగానే యత్నిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.
                                         



మరింత సమాచారం తెలుసుకోండి: