ఒక ప్రముఖ కన్జ్యూమర్ బ్రాండ్ ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మహేష్ ఈ నెలలో రాబోతున్న వాలెంటైన్స్ డే పై వేసిన సెటైర్లు ఆకార్యక్రమానికి వచ్చిన మీడియా వర్గాలను ఆశ్చర్య పరిచాయి. ఫిబ్రవరి 14న రాబోతున్న వాలెంటైన్స్ డేని ఎలా సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు అంటూ ఎదురైన ప్రశ్నకు మహేష్ ఊహించని సమాధానం ఇచ్చాడు. 
Mahesh Babu Brahmotsavam Interview
తనకు పెళ్ళి అయి 14 సంవత్సరాలు అవుతున్న పరిస్థుతులలో ఇప్పుడు తనకు ప్రేమికుల రోజు ఏమిటని జోక్ చేస్తూ పెళ్ళికాని హీరోలను అడగండి అంటూ సెటైర్ వేసాడు. ఇదే సందర్భంలో మరో మీడియా సంస్థ ప్రతినిధి మహేష్ భార్య నమ్రత ప్రపోజ్ చేయక ముందు మరెవ్వరైనా ప్రపోజ్ చేసారా అని అడిగిన ప్రశ్నకు మహేష్ తన హాస్య చతురతతో సమాధానం ఇస్తూ చురకలు అంటించాడు. 

నమ్రతతో తన పెళ్లి ముందు జరిగిన ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు బయటపెట్టి తన భార్యతో తనకు గొడవలు ఎందుకు అంటూ ఆ ప్రేమలు అన్నీ తన గుండెలలోనే ఉండిపోతాయి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న తన మ్యారేజ్ డే నాడు నమ్రతకు ఖరీదైన గిఫ్ట్ కొని ఇస్తూ ఉంటానని మళ్ళీ వాలెంటైన్స్ డే రోజు తాను మరో గిఫ్ట్ కొని ఇవ్వాలి అంటే ఇంకా ఎన్ని యాడ్స్ లో నటించాలి అంటూ తాను యాడ్స్ విషయంలో కూడ సూపర్ స్టార్ అన్న సంకేతాలు ఇచ్చాడు.   
సోషల్ మీడియా పాత్ర గురించి
ప్రస్తుతం మహేష్ కు సినిమాల కంటే వాణిజ్య ప్రకటనలతోనే ఎక్కువ డబ్బు వస్తోంది. మహేష్ లాంటి హీరో అయితే ఒక్క బ్రాండ్ కు ప్రచారం చేస్తే 20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. క్రేజ్ ఉంది కాబట్టి కార్పొరేట్ సంస్థలు కూడా మహేష్ కోసమే ఎగబడుతున్నాయి. అయితే మహేష్ తన కెరీర్ 19 ఏళ్లలో 24 సినిమాలు మాత్రమే నటిస్తే కేవలం 5 ఏళ్ళలో తన సూపర్ స్టార్ ఇమేజ్ తో 31 యాడ్స్ చేశాడు. అందుకే సినిమాలలో నటించిన దాని కంటే తనకు యాడ్స్ లో నటిస్తే ఎక్కువ డబ్బు వస్తోంది అంటూ తరుచు కామెంట్స్ చేస్తూ ఉంటాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: