ఒక తెలుగు హీరోకు త‌మిళ సినిమా రంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవ‌డం చాలా కష్టమైనపని. అయితే అటువంటి అదృష్టం విజయ్ దేవరకొండకు దక్కింది  అత‌డి సినిమా ‘అర్జున్ రెడ్డి’ ని తమిళ ప్రేక్షలు బాగా ఆదరించారు.  తమిళనాట నేరుగా తెలుగులోనే విడుద‌లైనా ఊహించ‌ని స్పంద‌న తెచ్చుకుంది. 

ఈ సినిమాను చెన్నైతో స‌హా కొన్నితమిళనాడు న‌గ‌రాల్లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ర‌న్ అయింది.  దీనితో  అర్జున్ రెడ్డిగా త‌మిళ‌నాట మంచి పాపులారిటీ సంపాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ క్రేజ్ తో విజయ్ ‘నోటా’ రూపంలో స్ట్రెయిట్ త‌మిళ్ సినిమాను చేసాడు. ఈసినిమా పెద్దగా అడకపోయినా నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. 

ప్రస్తుతం విజయ్ మరో తమిళ స్ట్రెయిట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో త‌మిళ‌నాట విజ‌య్ ప‌రువు తీసేప‌ని ఒక‌టి జ‌రుగుతోంది. అత‌ను న‌టించిన ఫ్లాప్ మూవీ ‘ద్వార‌క‌’ ను త‌మిళంలోకి డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌బోతున్నాడు ఒక నిర్మాత‌. ఇందులో కథ ప‌రంగా కానీ న‌ట‌న విష‌యంలో కానీ విజ‌య్ ముద్రంటూ ఏమీ క‌నిపించ‌దు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఉండ‌గానే ప్రేక్ష‌కుల్ని నిరాశ ప‌రిచినందుకు విజయ్ క్షమార్పణలు కూడ చెప్పాడు. 

అయితే ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి ద్వారక’ అంటూ ప్రమోట్ చేస్తూ అర్జున్ మ్యానియాను ఈ సినిమాకు వాడుతున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం తమిళనాడులో భారీ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఫెయిల్యూర్ సినిమా విడుదల అయితే ఇప్పటికే ‘నోట’ తో దెబ్బతిన్న తన క్రేజ్ మరింత తగ్గిపోతుందని విజయ్ దేవరకొండ భయపడుతున్నట్లు టాక్. దీనితో విజయ్ కష్టాల పై కోలీవుడ్ మీడియా సెటైర్లు వేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: