ఎఫ్ 2' సాధించిన ఘనవిజయంతో దిల్ రాజ్ నిర్మాతగా తన జోరును మరింత పెంచి కనీసం ఈ ఏడాది తన నిర్మాణంలో మరో రెండు సినిమాలు ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' సక్సస్ తో మీడియాకు కూడ సెలెబ్రెటీగా దిల్ రాజ్ మారిపోవడంతో వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ దిల్ రాజ్ తెగ హడావిడి చేస్తున్నారు. 
కావాలని ఎవరూ ఇబ్బంది పెట్టరు
ఇలాంటి పరిస్థుతులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ మాట్లాడుతూ పవన్ తనకు డేట్స్ ఇస్తే చాలు తాను నిర్మిస్తున్న సినిమాల నిర్మాణం అన్నీ ఆపుచేసి పవన్ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తానని కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఏనిర్మాత ఇవ్వనంత భారీ పారితోషికం తాను పవన్ కు ఇవ్వడానికి రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. 
రెమ్యూనరేషన్ పరంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు
ఇదే సందర్భంలో తన మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుతూ ఏవిషయం అయినా ఓపెన్ గా తాను చెప్పేస్తానని దీనివల్ల కొందరు హర్ట్ అవుతున్నారు అన్న విషయం తనకు తెలిసినా తన పద్ధతి తాను మార్చుకోలేక పోతున్నాను అంటూ తన మైనస్ పాయింట్స్ బయటపెట్టాడు దిల్ రాజ్. ఇదే సందర్భంలో ఇండస్ట్రీలోని హీరోల గురించి మాట్లాడుతూ ప్రతివ్యక్తి మరొక వ్యక్తిలా ఉండరని వారందరితో సినిమాలు తీస్తున్నప్పుడు వారి మనస్తత్వాలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే సినిమాలు తీయడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నాడు ఈ క్రేజీ నిర్మాత. 
వపన్ కళ్యాణ్ ఓకే చెబితే
తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి బయటపెడుతూ వీలైనంత వర్కౌట్ చేయడంతో పాటు హ్యాపీగా ఉండటం వల్ల తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను అంటూ తన సక్సస్ సీక్రెట్ బయటపెడుతున్నాడు. అయితే తనకు 'ఒక్కడు' లాంటి ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా తీయాలని ఉన్నా సరైన కథ దొరకడం లేదు అని అంటున్న దిల్ రాజ్ మాటలను పరిశీలిస్తే ఇలాంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్ పవన్ తో తీయాలని కలలు కంటున్నాడా అని అనిపించడం సహజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: