సృజనాత్మక దర్శకుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్ కథ, కాన్సెప్ట్  దొరికితే చెలరేగి పోతుంటాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సబ్జెక్టే  రామ్ గోపాల్ వర్మకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపంలో దర్శనమిచ్చింది. సినిమా నిర్మాణం మొదలెట్టారు. తమ సినిమానే అసలు సిసలైన ఎన్టీఆర్ బయోపిక్ అని, నిజాలు మత్రమే తమ సినిమాలో ఉంటాయని, పెద్దాయన ఆకాశంలో ఉండి తన దీవెనలు కూడా తమకే అందిస్తాడని ఘంఠాపథంగా చెపుతున్న వర్మ తాజా గా ఈ మరోసారి ట్విట్టర్ ద్వారా సెన్సేషనల్ ట్వీట్లు చేశాడు.
Image result for ram gopal varma Lakmis NTR
ఈమధ్యే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల తేదీ 'ఎన్టీఆర్ మహానాయకుడు' మీదే ఆధారపడి ఉంటుందని ఓపెన్ గా క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చాడు. 
Image result for chandrababu back staabbing NTR in bahubali style
"కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది ఒక ఫాంటసీ.... ఎన్టీఆర్ ను సీబీఎన్ ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది యధార్ధం. దాన్ని   లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కన్నులారా చూడండి" అంటూ ట్వీట్ చేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా పబ్లిసిటీ కాంపెయిన్ ట్యాగ్... లైన్...'హూ బ్యాక్ స్టాబ్డ్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్ ను ఎవరు వెన్నుపోటు పొడిచారు)?" అని కూడా ట్వీట్ చేశాడు. 


ఈ ఇంగ్లీష్ వాక్యంలో అన్ని అక్షరాలు నలుపు రంగు లో ఉంటే సిబీఎన్ అక్షరాలు మాత్రం ఎరుపురంగులో ఉన్నాయి. అంటే తాను ఆశించే సమాధానం, ఆనాడు అందరూ కళ్ళారా వీక్షించిన ఎన్టీఆర్ వెన్నుపొటుకు,  సమాధానం  ప్రశ్న లోనే ఉందన్నమాట.   దట్స్ రామ్ గోపాల్ వర్మ.  

Image result for ram gopal varma tweet of back stabbing NTR

మరింత సమాచారం తెలుసుకోండి: