సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టత్మకంగా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో అశ్వనిదత్, పివిపిలు కూడా ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న మహర్షిలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.


ఈ సినిమా నుండి అప్పుడెప్పుడో చిన్న టీజర్ అది కూడా మహేష్ బాబు స్టైల్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోస్టర్స్ తోనే సరిపెడుతున్నారు. మహేష్ తప్ప మహర్షి నుండి ఇంకెవరి లుక్ రివీల్ అవలేదు. అయితే ఎలా వచ్చిందో ఏమో కాని మహర్షిలో మహేష్, పూజా కౌగిలించుకున్న పిక్ ఒకటి బయటకు వచ్చింది.


మహేష్ బిగి కౌగిలిలో పూజా సేద తీరుతున్న ఈ ఫోటో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు భలే నచ్చేసింది. ప్రస్తుతం వరుస స్టార్ అవకాశాలతో సూపర్ క్రేజ్ మీద ఉన్న పూజా మహేష్ అంత అందగాడి పక్కన నటించడం ఆమెకు మరింత పాపులారిటీ తెస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఎన్.టి.ఆర్ పక్కన అరవింద సమేతతో అలరించిన పూజా మహర్షిలో ఎలా కనిపించనుందో చూడాలి.  


లీకైన ఈ పోస్టర్ చూస్తుంటే మన రిషిని ప్రేమించే అమ్మాయిగా పూజా కనిపిస్తుంది.. అందుకే పోస్టర్ లో మహేష్ ను కౌగిలించుకున్న ఆమె కళ్లు మూసి పరవశంతో ఉంది. అయితే మహేష్ మాత్రం సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. దాని వెనుకున్న కారణాలు తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మహేష్ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: