భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో భాషల్లో తన మధుర గానంతో మంత్ర ముగ్దులను చేస్తున్న సింగర్ బాలసుబ్రమాణ్యం.  తెలుగు  ఘంటసాల దర్వాత బాలసుబ్రమాణ్యం పాటలతో ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు.  కొంత కాలంగా అడపాదడపా పాటలు పాడుతూ..బుల్లితెరపై ఎక్కువగా కనిపిస్తున్నాడు.  తాజాగా బాలసుబ్రమాణ్యం కొంత మంది హీరోయిన్ల వస్త్రధారణపై ఘాటైన కామెంట్స్ చేశారు.  పొట్టి దుస్తులు ధరించి అంగాంగ ప్రదర్శన చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు.

అది వారి అమాయకత్వమనుకోవాలా? లేక, అటువంటి దుస్తులు ధరిస్తే తప్ప సినిమాల్లో అవకాశాలు రావని భావిస్తున్నారని అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఈ మద్య కాలంలో హీరో, హీరోయిన్ల వేస్తున్న వస్త్రాలపై యువత మోజు పెంచుకుంటున్నారని..అలాంటి వారికి వీరు ఏం సందేశం ఇవ్వాలని ఇలాంటి నిచమైన డ్రెస్సులు వేసుకుంటున్నారని అన్నారు.

మూవీస్ లోనే అలాంటి డ్రెస్ వేస్తున్నారంటే..ఇక ఆడియో వేడుకలకు మరింత దారుణమైన వస్త్రాలు వేసుకుంటూ వస్తున్నారని వాపోయారు. తన వ్యాఖ్యలపై హీరోయిన్లు మండిపడినా తన అభిప్రాయం మాత్రం ఇదేనని బాలు తేల్చి చెప్పారు. తాను అన్న విషయాలు కొంత మంది హీరోయిన్లకు అర్థం కాకపోవచ్చని..చాలా మంది ఇతరభాష హీరోయిన్లు ఇక్కడకి వస్తున్నారని అన్నారు. తన వ్యాఖ్యలపై హీరోయిన్లు ఎలా స్పందిస్తారన్న విషయంతో తానేమీ భయపడడం లేదన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: