ప్రశాంత వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి’ టీజర్ ఆవిష్కరణ ఫంక్షన్ లో రాజశేఖర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈసినిమా షూటింగ్ సమయంలో తనకు దర్శకుడు ప్రశాంత్ వర్మకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి అన్న విషయంలో ఎటువంటి నిజాలు లేవని అంటూ కామెంట్స్ చేసాడు. 
జీవిత టార్చర్ అనుభవించింది
అయితే తనకు దర్శకుడు ప్రశాంత్ వర్మకు మధ్య సమన్వయం చేస్తూ టార్చర్ అనుభవించింది జీవిత మాత్రమే అంటూ ఆమెకు తన టార్చర్ ఏవిధంగా ఉంటుందో తెలుసు అంటూ జోక్ చేసాడు. అంతేకాదు తాను ఈ షూటింగ్ కోసం 48 గంటలు వరసగా షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ రాజశేఖర్ తన యాంగ్రీ యంగ్ మ్యాన్ ట్యాగ్ పై సెటైర్లు వేయడంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు అంతా తెగ నవ్వుకున్నారు.  
రాజశేఖర్ ఫ్యామిలీ ఎలాంటిదేంటే...?
తనను గతంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ మీడియా వార్తలు వ్రాసిన సందర్భాన్ని వివరిస్తూ తన వయసు పెరిగింది కాబట్టి యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అంటూ వార్తలు వ్రాసుకోవచ్చు అంటూ జోక్ చేసాడు. ప్రస్తుత పరిస్థితులలో నటించాలని ఉద్దేశ్యం ఉన్నా సినిమాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కరువైపోతున్నారు అంటూ ప్రస్తుతం తనకు సినిమాలు రావడమే అదృష్టంగా మారింది అంటూ రాజశేఖర్ మాట్లాడిన మాటలలోని నిజాయితీ నిన్నటి ఈవెంట్ కు హైలెట్ గా మారింది. 
నేను అంత చెడ్డవాన్ని కాదు
‘గరుడవేగ’ సినిమాకు ముందు కొందరు తనను నటన ఆపుచేసి రెస్ట్ తీసుకోమన్నారని అంటూ రెస్ట్ అనే పదం వింటే తనకు విపరీతమైన కోపం వస్తుంది అంటూ మరొకసారి జోక్ పేల్చాడు. ‘కల్కి’ సినిమాతో తిరిగి తన క్రేజ్ పెరుగుతుంది అంటూ ఈ యాంగ్రీ స్టార్ కంటున్న కలలు నిజం అవుతాయో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: