ఈ మద్య  కాలంలో సోషల్ మీడియాలో మట్టిలో మాణిక్యం.. పల్లెకోయిలగా వైరల్ అయిన పేరు పసల బేబి. తూర్పు గోదావరి జిల్లా వడిశలేరు గ్రామం. ఓ చెలియా నా ప్రియ సఖియా అంటూ ఆమె పాడగా మొబైల్ కెమెరాలో చిత్రీకరించి అప్ లోడ్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో ఆమె పాటను కొంత మంది యూట్యూబ్ ఛానల్స్ వారు బాగా ప్రమోట్ చేశారు.  అప్పటి నుంచి పసల బేబిపై టాలీవుడ్ దృష్టి పడటం..మ్యూజిక్ డైరెక్టర్ రాజా ఆమెను మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖకు పరిచయం చేసి పాట వినిపించడం ఇలా ఒక్కసారీ మీడియా దృష్టి ఆకర్షించింది పసల బేబి. 
Image result for పసల బేబి
టాలవుడ్ సింగర్స్ ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం మొదలు పెట్టారు.  ఇటీవల పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీబాల సుబ్రమణ్యం పసల బేబి పాటకు ముగ్దుడయ్యాడు..ఆమెను ఎంతో గొప్పగా పొగిడారు. ఈ నేపథ్యంలో నటుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె   ఆమెకు ‘పలాస 1978’ అనే చిత్రం ద్వారా తొలి సినిమా అవకాశం ఇవ్వటమే కాకుండా.. మరో పాటను సైతం పాడించి దానిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన విషయం తెలిసిందే.   
Image result for పసల బేబి
‘మట్టి మనిషినండి నేను.. మాణిక్యమన్నారు నన్ను’ అంటూ సాగే ఈ పాట యూ ట్యూబ్‌లో వేగంగా వ్యూస్ రాబడుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయటం విశేషం. తాజాగా ఈ పాట 10లక్షల 15 వేల వ్యూస్‌ను.. దాదాపు 80 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించిన రఘు.. ‘మూడు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్.. నిండు మనసుతో, ప్రేమగా ఈ పాటని ఇష్టపడిన మీ అందరికీ కృతజ్ఞతలు’ అని పోస్ట్ పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: