వెండితెరపై తమదైన ముద్ర వేసిన స్టార్ హీరోలు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటారు.  ఇక ఎంజీఆర్ తమిళనాట అన్నాడీఎంకే పార్టీ అధినేతగా ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు.  ఇలా సినీ ఇండస్ట్రీలో చాలా మంది అగ్రతారలు సొంతంగా పార్టీ స్థాపించారు..కొంత మంది సక్సెస్ కాగా మరికొంత మంది కనుమరుగయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేశారు.  ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. 


ఇక తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కూడా సొంత పార్టీలు స్థాపించారు.  ఇక   మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా తన రాజకీయ ఎంట్రీ పై మోహన్ లాల్ స్పందించారు.. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంగానీ, అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంగానీ లేదని స్పష్టం చేశాడు. రాజకీయాలు నాకు సరిపడవు. నేను ఎప్పటికీ ఓ నటుడిగానే ఉండాలని అనుకుంటున్నా. ఈ వృత్తిలో ఉన్న స్వేచ్ఛను నేను ఆస్వాదిస్తున్నాను. తిరువనంతపురం స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు ఈ మధ్య బీజేపీ నేత రాజగోపాల చెప్పిన విషయం తెలిసిందే. 


దీంతో మోహన్‌లాల్ బీజేపీలో చేరబోతున్నాడన్న ప్రచారం జరిగింది. మరోవైపు రాజకీయాల్లోకి రాకూడదనన్న మోహన్‌లాల్ నిర్ణయాన్ని సమర్థించాడు డైరెక్టర్ మేజర్ రవి. ఆయన రాజకీయాల్లోకి రావడం అనేది కేవలం పుకార్లు మాత్రమే అన్నారు.  గతేడాది మోహన్‌లాల్ ప్రధాని మోదీని కలిశాడు. ఆ తర్వాత మోదీపై ప్రశంసలు కురిపించాడు. దీంతో అప్పుడే అతడు బీజేపీలో చేరబోతున్నాడన్న పుకార్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: