ప్రస్తుత టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ మరో రికార్డు సృష్టించాడు. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించేశాడు. అందులోనూ 30 ఏళ్లలోపు విజేతలపై ప్రత్యేకంగా వెలువరించిన జాబితాలో చోటు దక్కించుకుని మరోసారి ఔరా అనిపించాడీ టాలీవుడ్ వండర్ హీరో.

Image result for vijay devarakonda 30 under 30


ఇండియాలో వివిధ రంగాల్లో పాపులారిటీనీ, సక్సస్ అయిన 30 ఏళ్ల లోపు వారితో ఫోర్బ్స్ సంస్థ ఓ జాబితా విడుదల చేసింది. అందులో ఎంటర్ టైన్ మెంట్ కేటగిరీలో విజయ్ దేవరకొండ చోటు సంపాదించాడు. టాలీవుడ్ నుంచి చోటు దక్కించుకుంది ఒక్క విజయ్ మాత్రమే.

Image result for vijay devarakonda 30 under 30


తెలుగు సినిమాల్లో రైజింగ్ స్టార్ విజయ్. తన చాలా సింపుల్ గా గ్రౌండెడ్ గా ఉంటారు. ఎటువెళ్లాలో తనకు బాగా తెలుసు అని ఆ మాగజైన్ పేర్కొంది. 2019లో విజయ్ నిర్మించిన సినిమా కూడా విడుదల కాబోతోందని ఆ మాగజైన్ తెలిపింది. కేవలం నటుడిగానే కాకుండా ఇంకా పలు కోణాల్లో విజయ్ పేరు సంపాదించుకుంటున్నారు.

Related image


కేరీర్ లో సక్సస్ సాధించిన కొద్దిరోజులకే ఆయన నిర్మాతగానూ అవతారం ఎత్తుతున్నారు. అంతే కాదు.. రౌడీ పేరుతో ఓ బ్రాండ్ క్రియేట్ చేసి వస్త్రాల వ్యాపారం కూడా ప్రారంభించాడు. ఈ బ్రాండ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. మొత్తానికి విజయ్‌ కు ఇప్పుడు స్వర్ణయుగం నడుస్తుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: