ఈమధ్య ఒక బాలీవుడ్ పత్రిక ఫిలిం సెలెబ్రెటీల ఆస్థుల పై ఒక ఆసక్తికర కథనం ప్రచురిస్తూ అందులో రామ్ చరణ్ కు 13 వందల కోట్లు ఆస్థులు ఉన్నాయి అంటూ వచ్చిన వార్త పై మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోయినట్లు సమాచారం. దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి చరణ్ కన్నా ఎందరో టాప్ హీరోలు ఉన్నా కేవలం చరణ్ ఆస్థులను హైలెట్ చేస్తూ ఆ బాలీవుడ్ మీడియా పత్రిక ఎందుకు కథనం ప్రచురించింది అన్న కోణంలో మెగా ఫ్యామిలీ లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. 
Ram Charan
 ఆ కథనంలో చరణ్ కు అత్యంత ఖరీదైన 5 విలాసవంతమైన కార్లతో పాటు 38 కోట్ల విలువ చేసే ఖరీదైన భవంతి కూడ ఉంది అని వార్తలు రావడం మెగా ఫ్యామిలీని కార్నర్ చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి చరణ్ కట్టుకున్న ఈ భారీ విల్లా ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉందని దీనికి సంబంధించిన స్థలం కూడ ఎప్పుడో కొన్నది అయిన నేపధ్యంలో ప్రస్తుత మార్కెట్ వేల్యూలో చరణ్ ఇంటి విలువను అంచనాకడుతూ ఆ ఇంటికి 38 కోట్ల విలువ కట్టడంలో ఆ బాలీవుడ్ పత్రిక చరణ్ పట్ల ఎందుకు అంత అత్యుత్సాహం చూపించింది అన్న కోణంలో మెగా ఫ్యామిలీ ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. 

దీనికితోడు చరణ్ కు ఉన్న అత్యంత విలాసవంతమైన ఆస్టన్ మార్టిన్ కారు చరణ్ కొనుక్కున్నది కాదనీ అది ఉపాసన ఫ్యామిలీ నుండి గిఫ్ట్ గా వచ్చిన నేపధ్యంలో అది చరణ్ ఆస్థి ఎలా అవుతుంది అనీ మెగా ఫ్యామిలీ అభిప్రాయపడుతున్నట్లు టాక్. దీనికితోడు అపోలో సంస్థకు చెందిన వందల కోట్ల విలువైన షేర్స్ అన్నీ చరణ్ వి కావనీ అవన్నీ ఉపాసనవి అని అభిప్రాయపడుతూ ఈ ఆస్థులు అన్నీ చరణ్ ఆస్థులుగా చూపెడుతూ ఆ బాలీవుడ్ పత్రిక ఎందుకు కథనం ప్రచురించిందో తెలియక మెగా ఫ్యామిలీ తల పట్టుకుంటున్నట్లు టాక్. 

దీనికితోడు ఈమధ్య కాలంలో ఫోబ్స్ పత్రిక ప్రచురిస్తున్న సెలెబ్రెటీల ఆస్థుల వివరాలు వాస్తవానికి దూరంగా ఉండటంతో ఈ ఆస్థుల ప్రకటనల వల్ల తమకు అనుకోని సమస్యలు ఎదురౌతున్నాయి అని చాలామంది సెలెబ్రెటీలు గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఒక స్థాయి తరువాత ఆస్థులు ఉన్నాయి అని చెప్పుకోవడం కూడ సెలెబ్రెటీలకు ఎంత తల నొప్పిగా మారిందో అర్ధం అవుతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: