బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరు.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దాదాపు దొరికేసినట్టే. బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ మూడవ సీజన్ కు సెట్ చేశారట. హోస్ట్ గా తారక్ సీజన్ 1 ఏ రేంజ్ లో అదరగొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


బిగ్ బాస్ 1 మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ సక్సెస్ ఫుల్ గా చేశాడు. సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. సెకండ్ సీజన్ హోస్ట్ కన్నా కంటెస్టంట్స్ చేసిన హడావిడి వల్ల షో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా కౌశల్ ఇంకా అతని ఆర్మీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 కి తారక్ ఫైనల్ అయినట్టే అంటున్నారు.


ఈ సీజన్ కోసం ఎన్.టి.ఆర్ కు 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అంటే దాదాపుగా ఒక సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయినా సరే ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ టీం కు కండీషన్స్ పెట్టాడట. ముఖ్యంగా కంటెస్టంట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని. బయట ఫ్రెండ్స్ అయిన వారిని అసలు హౌజ్ లోకి తీసుకు రావొద్దని అంటున్నాడట.


అంతేకాదు అన్ని రంగాల వారిని కవర్ చేసేలా కంటెస్టంట్స్ ఉండాలని కేవలం సెలబ్రిటీస్ మామాత్రమే కాదని చెప్పాడట. అయితే ఎన్.టి.ఆర్ చెప్పిన వాటికన్నిటికి బిగ్ బాస్ నిర్వాహకులు ఓకే అన్నారట. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. ప్రస్తుతం కంటెస్టంట్స్ తో డిస్కషన్స్ చేస్తున్నారు. అవి పూర్తవగానే షో డీటైల్స్ వెళ్లడిస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: