వినయ విధేయ రామ' సూపర్ ఫ్లాప్ అయిన తరువాత మౌన ముద్రలోకి వెల్లిపోయిన రామ్ చరణ్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడాడు. తన అభిమానులకు విడుదల చేసిన ఉత్తరంలో 'వినయా విధేయ రామ' ఫెయిల్ అయినందుకు తాను కూడ విపరీతంగా బాధ పడుతున్నానని వివరిస్తూ తన బాధను తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

అయితే ఈసినిమా కోసం ఈమూవీకి  పనిచేసిన టెక్నీషియన్స్ అంతా విపరీతంగా కష్టపడ్డారని ఎవరి కష్టంలోను లోపం లేదు అంటూ ఈసినిమా కోసం పనిచేసిన అందరి టెక్నీషియన్స్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ ఓపెన్ లెటర్ లో ఎక్కడా దర్శకుడు బోయపాటి శ్రీను పేరు పేర్కొనక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. బోయపాటిని నమ్మి ఇలాంటి భారీ సినిమాను చేస్తే తన నమ్మకాన్ని బోయపాటి నిలబెట్టుకోలేదు అని కోపమా లేకుంటే బోయపాటి పేరును కూడ టెక్నీషియన్స్ అన్న పదంలో కలిపేశాడా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

మరికొందరైతే ఈ ఉత్తరంలో చరణ్ బోయపాటి పేరు వ్రాస్తే అభిమానులు మరింత రెచ్చిపోతారు అన్న భయంతో చరణ్ కావాలని బోయపాటి పేరును తప్పించాడు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈసినిమా విడుదల అయ్యేదాక ఒక వైపు చిరంజీవి మరొక వైపు చరణ్ బోయపాటిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించి కేవలం ఒక ఫెయిల్యూర్ తో బోయపాటి పేరును ఆ ఉత్తరంలో పేర్కొనకపోవడం ఒక విధంగా బోయపాటికి అవమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

వాస్తవానికి కారణాలు ఏమైనా ఒకే ఒక్క సినిమా ఫ్లాప్ తో బయపాటి క్రేజ్ టాప్ హీరోల్లో తగ్గిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణకు రెండు ఘన విజయాలు ఇచ్చిన తరువాత కూడ బాలయ్య ప్రస్తుతం బోయపాటిని పూర్తిగా నమ్మలేకపోతున్నాడు అంటే ఒకే ఒక్క పరాజయం ఎలాంటి గొప్ప వ్యక్తిని అయినా కొన్ని మెట్లు దిగజారుస్తుందో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: