గతంలో మహేష్ దూకుడు సినిమాకు అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి ఆతరువాత దర్శకుడిగా మారి వరస విజయాలుసాదిస్తూ ‘ఎఫ్‌ 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో అగ్ర దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి మ్యానియా టాప్ హీరోలు అందరికి సోకడంతో మహేష్ కూడ ఇతడితో ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ చేయాలని ఈ మధ్య ఇతడితో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. 
Trending: Mahesh Babu's First Look From Bharath Ane Nenu
వాస్తవానికి గతంలో  ‘దూకుడు’ సినిమాను ‘గుడ్ బాయ్ లెనిన్’ అనే జర్మన్ సినిమా ఆధారంగా తీశారు. అయితే అందులో కామెడీ పార్ట్ అంతా రాసే భాద్యతను అనిల్ రావి పూడికి అప్పగిస్తే ఆ మూవీ నిర్మాణంలో ఉండగానే అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ 'పటాస్' మూవీ వైపు వెళ్లిపోయి అతడు ‘దూకుడు’ కు రాసిన సీన్స్ అన్ని ‘పటాస్’ కోసం వాడాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. 
Mahesh Babu Thanks Fans For Bharat Ane Nenu Success, Says He'd Love To Make A Sequel
దీనికితోడు మాఫియా అండ్ పోలీస్ నేపథ్యంలో అనిల్ రావిపూడి దగ్గర చాలా కథలు ఉన్నాయని టాక్. దీనితో తన దగ్గర ఉన్న పోలీసు కథలు అన్నింటినీ మహేష్ దగ్గర అనీల్ రావిపూడి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ కు అనీల్ రావిపూడి పై పూర్తి అభిమానం ఉన్నా అతడు చెప్పిన నాలుగు పోలీసు కథలు పూర్తిగా మహేష్ ను కన్ఫ్యూజ్ చేయడంతో ఈకథలకు మరింత క్లారిటీ తీసుకురమ్మని మహేష్ కోరినట్లు సమాచారం. 
five positive things in mahesh babu's bharat ane nenu telugu movie
తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ తన సొంత బ్యానర్ అయిన ఎమ్ బి ప్రొడక్షన్స్ లో నిర్మాత అనీల్ సుంకరతో భాగస్వామ్యం చేస్తూ అనీల్ రావిపూడితో ఒక సినిమాను వీలైనంత త్వరలో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు టాక్. అయితే అనీల్ రావిపూడి చెప్పిన పోలీసు కథలు అన్నీ పూర్తిగా మహేష్ కు నచ్చకపోవడంతో మహేష్ ఈవిషయమై కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు టాక్. మహేష్ ఇచ్చిన సమాధానంతో అనుమానంలో పడ్డ అనీల్ రావిపూడి తన ఆలోచనలలో ఉన్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు తుది మెరుగులు దిద్ది ఆసినిమాను తానే స్వయంగా ఒక ప్రముఖ నిర్మాత భాగస్వామ్యంతో నిర్మించే ఆలోచనలలో ప్రస్తుతం ఈయంగ్ డైరెక్టర్ బిజీగా ఉన్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: