ఔను.. విజయ్ దేవరకొండ బ్యాంక్ ఖాతాను ఆంధ్రా బ్యాంక్ బ్లాక్ చేసింది. ఎందుకంటారా.. మరి అకౌంట్లో మినిమం బ్యాలన్స్ మెయింటైన్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ చేయరా. ఇంతకీ మినిమమ్ బ్యాలన్స్ ఎంత అనుకుంటున్నారా.. కేవలం 500 రూపాయలు మాత్రమే.



మరి 500 రూపాయలు విజయ్ దేవరకొండ అకౌంట్లో లేకపోవడమేంటి.. ఆ సొమ్ము లేదని ఆంధ్రా బ్యాంక్ విజయ్ అకౌంట్ బ్లాక్ చేయడమేంటనుకుంటున్నారా.. ఇది నిజమే.. కాకపోతే ఇది నాలుగైదేళ్ల కిందటి ముచ్చట అన్నమాట. విజయ్ అప్పుడప్పుడే సినిమాలకు ట్రై చేస్తున్న రోజులు.

Related image


అప్పట్లో తన అకౌంట్లో 500 లేవని అకౌంట్ బ్లాక్ చేశారట. ఈ పాత జ్ఞాపకాలను విజయ్ దేవరకొండ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ఇటీవల ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషకం తీసుకుంటున్నాడు.

Related image


ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలంటారు కదా. అందుకేనేమో ఇప్పుడు కోట్లకు పడగలెత్తుతున్నా.. తాను 500 ఎకౌంట్లో లేక ఇబ్బందిపడిన రోజులను గుర్తు చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: