మెగా అభిమానుల అండతో ఎదిగిన అల్లుఅర్జున్ ఈమధ్య కాలంలో తన అభిమానుల బేస్ ను పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపధ్యంలో బన్నీ తరుచు తన అభిమానులను కలవడమే కాకుండా వారు తన నుంచి ఎటువంటి సినిమాలను కోరు కుంటున్నారో  తెలుసుకుని తన అభిమానులు మెచ్చే సినిమాలో నటించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. 

తాను నటించే సినిమాలలో డ్యాన్స్ లకు సంబంధించి మాత్రమే  కాకుండా తన సినిమాలలోని మేకోవర్ ను ఢిఫరెంట్ గా చూపించడానికి కాస్ట్యూమ్ హెయిర్ స్టైల్ ఇలా అన్ని విషయాలలో డిఫరెంట్ గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం అల్లు అర్జున్ సన్నగా కనిపించడానికి డైటింగ్ చేస్తున్నట్లు టాక్. 

ఇప్పుడు ఈవార్తలు మీడియాకు లీక్ అవ్వడంతో ఈవార్తలను ఆధారంగా చేసుకుని కొందరు అల్లు అర్జున్ వీరాభిమానులు రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వేస్తున్న సెటైర్లు చరణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నామా చేశామా వెళ్లిపోయామా అన్నట్లుగా ఉంటున్నాడు కానీ అతడి లుక్స్ విషయంలో ప్రత్యేకంగా వెరైటీ చూపించడం లేదనీ బన్నీ వీరాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

అంతేకాదు ‘వినయ విధేయ రామ’ ‘రచ్చ’ ‘నాయక్’ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ అన్నీ పక్కనపెట్టి చూస్తే ఏ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పడం చాలా కష్టం అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు కొత్తదనం కోసం ట్రై చేయకపోవడం వల్లే చరణ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదనీ ఇప్పటికైనా చరణ్ తన లుక్ పై దృష్టి పెట్టి బన్నీని చూసి నేర్చుకోవాలి అంటూ వేస్తున్న సెటైర్లు చరణ్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీనితో వారు ‘రంగస్థలం’ విషయం ఏమిటి అంటూ కొందరు అల్లు అర్జున్ అభిమానుల పై మాటల దాడి చేస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ చరణ్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలిసి కూడ ఇలా అర్ధంలేని కామెంట్స్ తో తమ విలువైన సమయాన్ని కొందరు ఎందుకు వృథా చేసుకుంటున్నారో సమాధానంలేని ప్రశ్న..   



మరింత సమాచారం తెలుసుకోండి: