లక్కు అంటూ వస్తే ఎవరూ ఆపలేరు. అది కన్నడ బ్యూటీ రష్మిక మందన విషయంలో ప్రూవ్ అవుతోంది. కేవలం ఏడాది క్రితం టాలీవుడ్లోకి చలో అంటూ వచ్చేసిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. అయితే అది చిన్న సినిమా కావడంతో పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. ఆ తరువాత గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తో రష్మిక ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించేసింది. ఇపుడు రష్మిక మైకంలో టాలీవుడ్ ఉందంటే చిత్రం కాదు.


ఆమె ఇపుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో  సెలెక్ట్ అయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం లేటెస్ట్ మూవీ లో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. ఆ మూవీ తొందరలోనే సెట్స్ పైకి వెళ్తోంది. ఈ ఆఫర్ తో రష్మిక నక్కను తొక్కిందని అంటున్నారు. ఆమె ఎకాఎకీ  మెగా క్యాంపులోకి వెళ్ళిందని, అక్కడ నుంచి ఆమె దశ తిరగడం ఖాయమని కూడా అంటున్నారు.


రష్మిక ఇపుడు నితిన్ తో ఓ మూవీతో పాటు, మరో రెండు మూవీస్ చేస్తోంది. బన్నీతో మూవీ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం రష్మిక కొన్నేళ్ళ పాటు టాలీవుడ్ ని తన స్టార్ డం తో ఏలడం ష్యూర్ అంటున్నారు. ఎంతైనా ఈ కన్నడ కస్తూరం కదా... తన  గుభాళింపులు  టాలీవుడ్ కి ఇంపుగానే ఉన్నాయి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: