‘ఎఫ్ 2'  సక్సస్స్ తో  మంచి జోష్ మీద ఉన్న వెంకటేష్ నేటిరోజున మరింత జోష్ మీద ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు వెంకటేష్ కుమార్తె ఆశ్రిత నిశ్చితార్ధం చాలా సింపుల్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు మరియు దగ్గర బంధువులు మాత్రమే పాల్గొంటున్న ఈ ఫంక్షన్ ఈరోజు ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
ప్రేమ వివాహం
హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో ఆశ్రిత పరిచయం ప్రేమగా మారి ఆతరువాత ఇరువురి పెద్దల అంగీకారంతో ఈరోజు శుభం కార్డు పడుతోంది. బెకరి బిజినెస్ కు సంబంధించి అమెరికాలో ఉన్నత డిగ్రీ చదివిన ఆశ్రితకు భాగ్యనగరంలో ఒక బేకరీ చైన్ షాప్స్ ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశ్యం ఆమెకు ఉంది అన్న విషయం వెంకటేష్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 
నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడంటే..?
మార్చి 1న రామానాయుడు స్టూడియోస్ లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. జనవరిలో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళి హడావిడికి సంబంధించిన వార్తలు ఫోటోలతో మీడియా హడావిడి చేసిన నేపధ్యంలో త్వరలో వెంకటేష్ కూతురు పెళ్లి విషయంలో కూడ అలాంటి హడావిడి చేసే ఆస్కారం ఉంది. 
బంధువులు, సన్నిహితులు మాత్రమే
ఈరోజు జరుగుతున్న ఈ నిశ్చితార్ధం ఫంక్షన్ ను కేవలం ప్రవేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తున్న నేపధ్యంలో ఇండస్ట్రీ వర్గాలలోని చాలమందికి ఈకార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు వెళ్లలేదని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ పూర్తి అయిన తరువాత వెంకటేష్ తన కూతురు పెళ్లి ఎంగేజ్ మెంట్ ఫోటోలను మీడియాకు విడుదల చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈకొత్త సంవత్సరం వెంకటేష్ ను 100 కోట్ల హీరోగా మార్చి సంచలనం సృష్టిస్తే నిజ జీవితంలో మామ గారుగా మార్చి వెంకీకి పెద్ద తనం ఆపదిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: