దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో యాత్ర సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ సిఎం అయ్యేందుకు ప్రజలు తనపై నమ్మకం పెంచుకునేలా చేసిన పాదయాత్ర నేపథ్యంతో యాత్ర సినిమా కథ సాగుతుంది. యాత్ర సినిమా మెయిన్ కాన్సెప్ట్ కూడా అదేనని ముందునుండి చిత్రయూనిట్ చెబుతూ వస్తున్నారు.


మహి వి రాఘవ్ ఈ సినిమాను ఓ పొలిటిషియన్ కథగా కాకుండా ఓ మంచి మనసున్న మహా రాజు కథగా రాసుకున్నాడు. ప్రజల కష్టాలను చూసి చలించిన ఓ మహానేత కథగా యాత్ర వస్తుంది. ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. నిర్మాణంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.


కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నా అంటూ పాదయాత్ర కాన్సెప్ట్ తోనే సినిమా వస్తుందని ఆడియెన్స్ కు అర్ధమయ్యేలా దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈమధ్య వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ అంచనాలను అందుకోలేదు. అందుకే ఈ యాత్ర మీద కొందరికి డౌట్ ఉంది.


అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తుంది. మమ్ముట్టి లాంటి నటుడు వైఎస్ పాత్రలో ఎలా ఉన్నాడో అని సగటు సిని ప్రేక్షకుడు ఒక్కసారైనా సినిమా చూసే అవకాశం ఉంది. సో ఎలా లేదన్నా ఈ సినిమా సేఫ్ బిజినెస్ చేసినట్టే లెక్క. ఏరియాల వారిగా బిజినెస్ వివరాలు చూస్తే..


నైజాం : 3.36 కోట్లు 
సీడెడ్ : 2.2 కోట్లు 
ఆంధ్రా : 5.5 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.40 కోట్లు 
ఓవర్సీస్ : 2 కోట్లు 
వరల్డ్ వైడ్ బిజినెస్ : 13.40 కోట్లు   



మరింత సమాచారం తెలుసుకోండి: