తెలుగు అమ్మాయి అంజలి తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో శివ నాగేశ్వర్ రావు తీసిన ఫోటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అంజలి తమిళ పరిశ్రమలో సెటిల్ అయ్యింది. అయితే తెలుగులో చాలా గ్యాప్ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.


ఆ సినిమా టైంలో టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న అంజలి కెరియర్ మాత్రం ఊపందుకోలేకపోయింది. కొన్నాళ్లుగా కోలీవుడ్ హీరో జైతో లవ్ లో ఉన్నట్టు కనిపించిన అంజలి కొన్నాళ్లు అతనితో కలిసి ఉందన్నట్టుగా కూడా కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో ఇప్పుడు ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారట.


జైతో ప్రేమ ప్రయాణం ఎందాక వచ్చింది.. పెళ్లెప్పుడు అంటే జైతో లవ్వా.. అంటూ నవ్వినంత పని చేస్తుంది అంజలి. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంతకిమించి ఎక్కువ వెళ్లలేదని అంటుంది అంజలి. మరి స్నేహం పేరులో కలిసి తిరగడం ఓకే కాని ఒకే చోట ఉండటం ఏంటో.. మొన్నామధ్య వీరిద్దరు కలిసి క్లోజ్ గా దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఏమైందో ఏమో కాని అంజలి కూడా అందరు హీరోయిన్ల లానే వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో కనిపించిన అమ్మడు ఛాన్సుల కోసం గ్లామర్ గేట్లు కూడా ఎత్తేయడానికి సిద్ధమని సిగ్నల్స్ ఇస్తుంది. మరి అంజలికి తెలుగులో ఏ డైరక్టర్ బ్రేక్ ఇస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: