వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి భరిలో దిగి ఘోరమైన టాక్ ను స్వంతం చేసుకొని ఫ్లాప్ ను మూటకట్టుకుంది. దీనితో ఈ సినిమా ఫ్లాఫ్ కు కారణం బోయపాటేనని విమర్శలు చేసినారు . బోయపాటి మాస్ ఓవర్ డోస్, అసహజంగా డిజైన్ చేసిన కొన్ని యాక్షన్ సీన్లు బెడిసి కొట్టడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ సైతం సినిమా పరాజయాన్ని ఒప్పుకుంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాయడం, అందరూ కష్టపడి పని చేశాం కానీ... మిమ్మల్ని మెప్పించలేక పోయాం అంటూ క్షమాపణలు కోరడం హాట్ టాపిక్ అయింది.

ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి

చరణ్ రాసిన ఈ బహిరంగ లేఖపై అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే చరణ్ ఈ లేఖ రాయడాన్ని దర్శకుడు బోయపాటి జీర్ణించుకోలేక పోతున్నారట. రామ్ చరణ్ తన బహిరంగ లేఖలో ఎక్కడా కూడా దర్శకుడు బోయపాటి పేరు ప్రస్తావించలేదు. ఎవరినీ తప్పుబట్టకుండా అంతా కష్టపడి పని చేశాం, కానీ వర్కౌట్ కాలేదని మాత్రమే తెలిపారు. వాస్తవానికి బోయపాటికి ఈ లేఖ రాయడం ఇష్టం లేదట. అందుకే రామ్ చరణ్ తన లేఖలో ఆయన పేరు ప్రస్తావించలేదట. 

Image result for boyapati srinu

ఒక భారీ విజయం అందుకున్న తర్వాత ఒక స్టార్ హీరో సినిమా ప్లాప్ అయిందంటే... ఆ ఎఫెక్ట్ ఎవరిపై ఎక్కువ పడుతుంది అంటే దర్శకుడిపైనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే బోయపాటి ఈ లేఖపై అయిష్టంగానే ఉన్నారట. ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.  తను తీసిన సినిమా ఆడక పోతే.. ప్లాప్ అయిందని ఒప్పుకుంటూ స్వయంగా హీరోనే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం లాంటి సంఘటన బోయపాటి తన కెరీర్లో తొలిసారి ఎదుర్కొన్నారు. దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక సైలెంట్ అయిపోయారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: