ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయమై బాలకృష్ణ చాల లోతుగా విశ్లేషణలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య మధ్య వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రలో చక్కగా సరిపోయినా యంగ్ ఎన్టీఆర్ పాత్రలో ఏమాత్రం సరిపోలేదు అన్న కామెంట్స్ బాలకృష్ణ దృష్టికి రావడంతో ఈ విషయంలో ఒక చిన్న మార్పు చేర్పుల కోసం క్రిష్ తో ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 
NTR Biopic Trailer: Nandamuri Balakrishna Wonderfully Presents The Journey Of NTR, Vidya Balan Looks Fantastic
ప్రస్తుతం ‘మహానాయకుడు’ మూవీలో వచ్చే యంగ్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సీన్స్ ను బాలయ్య తను నటించినవికాకుండా మరెవరైనా ఒక యంగ్ హీరో చేత ఎన్టీఆర్ పాత్రను నటింపచేస్తే ఎలా ఉంటుంది అంటూ బాలయ్య ‘మహానాయకుడు’ లో ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీకి సంబంధించిన సన్నివేశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయని టాక్. ఈ సన్నివేశాలలో ఎన్టీఆర్ కాలేజి రోజుల సీన్ బసవతారకంతో వివాహం సీన్  ఉంటాయని తెలుస్తోంది. 
NTR Biopic First Poster: Nandamuri Balakrishna Is The Image Of NTR
దీనితో ఈ రెండు మూడు సీన్స్ కోసం ఒక యంగ్ హీరోని తీసుకుని అతడి పై ఈ సీన్స్ చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై క్రిష్ బాలయ్యల మధ్య మేధోమధనం జరుగుతున్నట్లు టాక్. అయితే ఇలాంటి ప్రయోగం చేస్తే సినిమా సీన్స్ లో కంటిన్యూటీ మిస్ అవుతుందని ఇలాంటి ప్రయోగం వల్ల ‘మహానాయకుడు’ కు కూడ అవమానం జరుగుతుందని కొందరు బాలయ్యను హెచ్చరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
9 heroines for ntr biopic
‘కథానాయకుడు’ పరాభవంతో ఏదోవిధంగా ‘మహానాయకుడు’ ని హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీలో ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీకి సంబంధించిన అనేక సంచలన విషయాలు చెప్పేవిధంగా కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెల మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ మూవీకి హైక్ తీసుకురావడానికి విశాఖపట్టణంలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయాలని బాలకృష్ణ ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: