సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు- పెళ్లిళ్లూ చోటు చేసుకుంటాయి. ఒకే చోట పని చేస్తూ ప్రేమలో పడుతుంటారు. ఐతే.. ఈ ప్రేమలు ఎక్కువగా హీరోలు-హీరోయిన్ల మధ్యే ఉంటాయి. కానీ ఓ తెలుగు హీరోయిన్ మాత్రం విలన్‌ ను ప్రేమించింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

Related image


ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరంటారా.. ఆమె ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు చేస్తున్న రోహిణి.. ఇటీవల ఓ టీవీ షోలో తన అందమైన ఫ్లాష్ బ్యాక్ ను ఆమె గుర్తు చేసుకున్నారు. బాలనటిగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి న రోహిణి హీరోయిన్ గా మాత్రం ఎక్కువగా పరభాషా చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు.

Image result for actress rohini

ఆమె మొదటిసారి ఓ మళయాల సినిమాలో హీరోయిన్ గా నటించిందట. ఆ సినిమాలో హీరోగా రఘువరన్ ఉన్నారు. అప్పుడు రోహిణికి కేవలం 15 ఏళ్లట. కానీ ఆమె తొలిచూపులోనే రఘువరన్ తో ప్రేమలో పడిపోయారట. కానీ చిన్నవయస్సు వల్ల బయటపడి చెప్పలేదట.

Related image


ఆ తర్వాత పదేళ్లపాటు ఆమె మళ్లీ రఘువరన్‌ను కలుసుకోలేదట. ఈ మధ్యలో రఘువరన్ డ్రగ్స్, మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారని తెలిసిందట. అయినా తన ప్రేమ మాత్రం తగ్గలేదట. ఆ తరువాత మరో సినిమాలో రఘువరన్ తో హీరోయిన్ గా నటించిన సమయంలో ఈసారి రఘువరనే తన ప్రేమను బయటపెట్టారట. అలా ఆ ప్రేమ జంట ఒక్కటైందట. బావుంది కదా హీరోయిన్ గారి విలన్ ప్రేమకథ.


మరింత సమాచారం తెలుసుకోండి: