ప్రపంచ ప్రసిద్ధి కాంచిన సెలెబ్రెటీల మైనపు బొమ్మలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో పెట్టడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇలాంటి గౌరవం మన తెలుగు సినిమా రంగానికి సంబంధించి ప్రభాస్ మహేష్ లకు దక్కింది. సింగపూర్ లో ఉన్న మహేష్ వ్యాక్స్ స్టాచ్యూను త్వరలో భాగ్యనగరానికి ఒకరోజు సందర్శనార్థం తీసుకురాబోతున్నారు. మహేష్ బాబుకు భాగస్వామ్యం ఉన్న ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపుబొమ్మను ఒకరోజుపాటు ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. 

ప్రస్తుతం సింగపూర్ మ్యూజియమ్ లో ఉన్న మైనపు బొమ్మను హైదరాబాద్ కు అతి జాగ్రత్తగా తీసుకురావాలని ఒక ప్రముఖ లాజేస్టిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మహేష్ మైనపు బొమ్మకు ఎటువంటి చిన్న డామేజ్ కూడ జరగకుండా సింగపూర్ నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి తిరిగి హైదరాబాద్ నుండి సింగపూర్ పంపించడానికి అయ్యే లక్షలాది రూపాయల ఖర్చును ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ సంస్థ భరిస్తున్నట్లు సమాచారం. 
Mahesh Babu and his wax statue
మహేష్ అభిమానులు తమ హీరో మైనపు బొమ్మతో ఫోటోలు తీయించుకునే అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేయబడ్డ ఈకార్యక్రమం వెనుక మహేష్ పిఆర్ టీమ్ అదేవిధంగా నమ్రత సలహా సహకారాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ అభిమానులకు జోష్ ను కలిగించే విధంగా ఏర్పాటు చేయబడ్డ ఈకార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుండి మహేష్ అభిమానులు వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. 
Mahesh Babu won the best actor for Telugu movie 'SVSC'.
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొనసాగుతున్న మహేష్ మ్యానియాను చూసి అనేక బహుళజాతి సంస్థలు వారి ప్రొడక్ట్స్ కు మహేష్ చేత ప్రచారం చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో కేవలం ఒక్కరోజు మాత్రమే హైదరాబాద్ లో సందర్శకులకు కనిపించబోయే మహేష్ మైనపు బొమ్మ ప్రదర్శనను ఒక సంచలనంగా మార్చి అతడి మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసి వచ్చేలా నిర్వహింప బడుతున్న ఈ వ్యూహం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: