రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో సంక్రాంతికి సూపర్ హిట్ గ్యారెంటీ అనేలా భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. పండుగ సీజన్ లో ఫెయిల్యూర్ మూవీగా ఇది డిస్ట్రిబ్యూటర్స్ కు 30 కోట్ల నష్టాలు తెచ్చింది. ఓ నిర్మాతగా రాం చరణ్ కు వీటిపై అవగాహన ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ నష్టాన్ని కొంతమేరకు సాల్వ్ చేసేలా ముందడుగు వేశాడు.


సంక్రాంతి టైంలోనే సినిమా అంచనాలను అందుకోలేదని ఓ లెటర్ ప్రిపేర్ చేశాడట రాం చరణ్. కాని పండుగ సీజన్ అయ్యాక రిలీజ్ చేస్తే బెటర్ అని కొందరు సలహా ఇచ్చారట. ఆ సలహా మేరకు రీసెంట్ గా చరణ్ అభిమానులకు, ప్రేక్షకులకు ఓ లెటర్ రాయడం జరిగింది. అయితే ఈ విషయంపై బోయపాటి శ్రీను సీరియస్ అయ్యాడట.


అంతేకాదు నష్ట నివారణ చర్యల్లో భాగంగా 30 కోట్ల లాస్ అని తేలగా చరణ్ తన రెమ్యునరేషన్ లో 5 కోట్లు రిటర్న్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దర్శకుడు బోయపాటి శ్రీనుని కూడా 5 కోట్లు ఇవ్వమని అడిగారట. 1,2 కోట్లు ఇస్తా తప్ప 5 కోట్లు మాత్రం ఇవ్వనని అన్నాడట బోయపాటి శ్రీను. అయితే ఈ విషయంపై నిర్మాత డివివి దానయ్యకు, దర్శకుడు బోయపాటి శ్రీనుల మధ్య గొడవ అయ్యిందట.


దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో బోయపాటి 5 కోట్లు ఇచ్చేది లేదు ఇస్తే 2 కోట్లు ఇస్తా అన్నాడట. సినిమాకు 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న బోయపాటి వివి ఆర్ బడ్జెట్ ను 100 కోట్లు చేశాడు. మరి అలాంటిది ఇప్పుడు నిర్మాతను ఆదుకునేందుకు 5 కోట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదట. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: