వరస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నాగచైతన్య విషయంలో సమంత ఏవిధంగా టెన్షన్ పడుతోంది అన్న విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. చైతు కెరియర్ ఆశాజనకంగా లేకపోవడంతో క్రేజీ డైరెక్టర్స్ కు కానీ భారీ నిర్మాణ సంస్థలు కానీ చైతన్యతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. 

అయితే దీనికి భిన్నంగా సమంతకు పెళ్ళి అయినా ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఆమెతో సినిమాలు తీయడానికి చాల నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో దిల్ రాజ్ తెలుగులో రీమేక్ చేస్తున్న ‘96’ మూవీలో నటించడానికి సమంత అంగీకారాన్ని తెలిపే ముందు దిల్ రాజ్ కు చైతన్య విషయానికి సంబంధించి ఒక కండిషన్ పెట్టింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
Samantha
తెలుస్తున్న సమాచారం మేరకు సమంత ’96’ రీమేక్ లో నటించాలి అంటే దిల్ రాజ్ తన నిర్మాణ సంస్థలో నాగచైతన్యతో ఒక సినిమాను ఇదే సంవత్సరం మొదలు పెట్టాలి అన్న కండిషన్ పై సమంత ‘96’ రీమేక్ లో నటించడానికి ఒప్పుకుంది అని అంటున్నారు. గతంలో దిల్ రాజ్ నాగచైతన్య మొట్టమొదటి సినిమా జోష్ ను తీసి ఆసినిమా ఫ్లాప్ అయిన తరువాత తిరిగి చైతూ వైపు ఎప్పుడూ దిల్ రాజ్ చూడలేదు. 
Samantha
మధ్యలో చైతన్యకు హిట్స్ వచ్చిన సందర్భంలో కూడ దిల్ రాజ్ ఆలోచనలలో చైతన్య లేడు. అయితే ఇప్పుడు సమంత కండిషన్ వల్ల దిల్ రాజ్ చైతూతో ఒక మంచి డైరెక్టర్ తో సినిమా తీయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. అక్కినేని కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడ ఇప్పటికీ చైతన్యకు ఒక హిట్ వస్తే మూడు ఫ్లాప్ లు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయంగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: