తెలుగు చలన చిత్ర సీమకు అక్కినేని, నందమూరి రెండు కళ్ళు. ఈ ఇద్దరు నటులు తెలుగు సినిమాను ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కించారు. తెలుగు ఖ్యాతిని దశ దిశలూ వ్యాప్తి చెందేలా చేసారు.  ఓ విధంగా ఆ ఇద్దరు నటులు వేసిన పునాది మీదనే నేటి టాలివుడ్ ఉందన్నది నిజం. వారి వారసులుగా బాలకృష్ణ, నాగార్జున తమ కెరీర్లో హిట్లు కొట్టి సుస్థిరం చేశారు.  ఇపుడు మూడవ తరం ప్రవేశించింది.


మరి గత డెబ్బయ్యెళ్ళుగా సాగుతున్న నందమూరి అక్కినేని నటనా వారసత్వం తీసుకుంటే నందమూరి మూడవ తరంలోనూ ఆ దూకుడు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీయార్ బాగానే ప్రూవ్ చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఇక బాలకృష్ణ మాస్ హీరోగా ఇప్పటికి హిట్లు కొడుతున్నాడు. కళ్యాణ్ రాం వంటి వారు ఫరవాలేదనిపించుకుంటున్నారు.  బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా రేపో మాపో అరంగేట్రం చేయనున్నాడు.


మరి అక్కినేని వంశంలో తీసుకుంటే నాగార్జున మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఫ్యామిలి హీరోగా ముద్ర వేసుకున్నారు. తండ్రి తరహాలోనే భక్తుడి పాత్రల్లో రాణించారు. ఆయన తరువాత తరంలో హీరోలు మాత్రం ఇప్పటికి తడబడుతున్నారు. ఇదే ఇపుడు నాగ్ ని కలవరపెడుతోందట  లేటెస్ట్ గా అఖిల్ నటించిన మూవీ మిష్టర్ మజ్ను ఫ్లాఫ్ అయింది. ఇది అఖిల్ కి మూడవ ఫ్లాప్.  దాంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న హిట్ కొత్తలేకపోతున్నాడే అన్న బాధ నాగ్ లో ఉందట

.

అదే టైంలో నాగ చైతన్య కెరీర్ కూడా అంత బాగా లేదు. హిట్లు చూసి రెండేళ్ళు అయింది. మరో హీరో సుమంత్ పరిస్తితి డిటోగానే ఉంది. సుశాంత్ అన్నా హీరో ఉన్నాడని జనం మరచిపోయారు.  నాగ్ సైతం కొడుకుల కెరీర్ లో పడి తన సినిమాలు తగ్గించేసారు.  ఈ నేపద్యంలో నాగ్ తీవ్రంగా కలత చెందుతున్నారని టాక్. ఇలాగైతే అక్కినేని బ్రాండ్ మసకబరుతుందా అన్నా బెంగ పట్టుకుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: