రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా వినయ విధేయ రామ ఫ్లాఫ్ అని ఒక బహిరంగ లేఖ ద్వారా రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు అందరూ బన్నీ విమర్సించడం మొదలెట్టారు.  సినిమా ఫ్లాప్ అయిందంటూ చరణ్ ఇచ్చిన ఇలాంటి స్టేట్ మెంట్ ను గతంలోనే బన్నీ ఇచ్చి ఉంటే బోయపాటి వ్యవహారం ఇంతవరకు వచ్చి ఉండేది కాదనేది తాజా డిస్కషన్ పాయింట్. గతంలో బన్నీ హీరోగా సరైనోడు సినిమా తీశాడు బోయపాటి. రిలీజైన మొదటిరోజు నుంచి సినిమాకు నెగెటివ్ టాక్ ప్రారంభమైంది.

Image result for allu arjun and ram charan

కానీ అప్పట్లో అల్లు అరవింద్ కోటరీ దాన్ని కవర్ చేసింది. మూవీకి విపరీతమైన వసూళ్లు వచ్చినట్టు, సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టు కవర్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అదే పరిస్థితి వినయ విధేయరామ సినిమాకు కూడా వచ్చింది. ఈ సినిమాకు కూడా మొదటిరోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. కానీ వసూళ్లు మాత్రం బాగా వచ్చాయంటూ రెండోరోజు నుంచే కథనాలు. చరణ్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేశాడు. వసూళ్ల సంగతి పక్కనపెడితే, తన సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచినందుకు ప్రెస్ నోట్ సాక్షిగా పరోక్షంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.

Image result for allu arjun and ram charan

సరిగ్గా ఇదే పనిని మూడేళ్ల కిందట (2016లో) సరైనోడు విషయంలో బన్నీ చేసి ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు చాలామంది. మూవీ ఎలా ఉన్నప్పటికీ మెగా కాంపౌండ్ మేనేజ్ చేసేస్తుందనే ఓ మూఢ నమ్మకంతో బోయపాటి ఇష్టమొచ్చినట్టు సినిమా తీశాడంటూ కామెంట్స్ పడుతున్నాయి. మరోవైపు ఈ విషయంలో బన్నీ-చరణ్ మధ్య పోలికలు కూడా ఎత్తిచూపిస్తున్నారు. చరణ్ లా ఫ్లాప్ అయిన సినిమాను ఫ్లాప్ అని ఒప్పుకోవడమే మంచిదని, కవర్ చేసుకుంటూపోతే డీజే, నా పేరు సూర్య లాంటి మరిన్ని సినిమాల్ని కవర్ చేసుకుంటూ పోవాల్సి వస్తుందని బన్నీపై పరోక్షంగా సెటైర్లు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: