టాలీవుడ్ హీరోల బ్రహ్మచారుల లిస్టులో కొనసాగుతున్న అడవి శేషుకు అమ్మాయిలలో మంచి క్రేజ్ ఉంది. ‘గూఢచారి’ సినిమా తరువాత ఈక్రేజ్ మరింత ఎక్కువైపోయింది. ఇలాంటి ఈ క్రేజీ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా అన్న అనుమానాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ఈమధ్య ఇతడు చేసిన లేటెస్ట్ ట్విట్.
Adivi Sesh Biography, Age, Height, Weight, Family, Caste, Wiki & More
ఈ నెలలో తాను ఒక ముఖ్య ప్రకటన చేయబోతున్నానని అంటూ ట్విట్ చేసాడు. దీనితో ఆ ప్రకటన అతడి పెళ్ళి గురించే అంటూ కొందరు ఊహాగానాలు చేస్తుంటే మరికొందరు అతడు నటించబోయే లేటెస్ట్ సినిమా గురించి అంటూ మరొక విధంగా ఆలోచిస్తున్నారు. గత కొంత కాలంగా అడవి శేషు ఒక ప్రముఖ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మాజీ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ట్విట్ అతడి పెళ్ళి గురించి మాత్రమే అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు. 
Adavi Sesh Photo: Ch. Vijaya Bhaskar
ఈవిషయానికి మరింత ట్విస్ట్ ఇస్తూ ఈషా రెబ్బా `ఏంటి శేష్‌.. పెళ్లి క‌బురు చెప్ప‌బోతున్నావా` అని అడివి శేష్‌ని ఉద్దేశించి ట్వీట్ చేయడంతో పాటు బ్ర‌హ్మాజీ మరో ట్విట్ చేస్తూ ‘శేషుకు ఇంకా పెళ్లి కాలేదా’ అని జోక్ చేయడంతో ఈ పెళ్ళి వార్తల హడావిడి మరింత పెరిగింది. ఈషారెబ్బా ట్వీట్‌కు మాత్రం అడివి శేష్ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశాడు.
అడివి శేష్ “గూఢచారి” అమెరికా షెడ్యూల్ మొదలు !!
దీనితో అడవి శేష్ పెళ్ళికి సంబంధించి ఎదో జరుగుతోంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మంచి నటుడుగా సినిమా కథల రచయితగా పేరు గాంచిన ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం సినిమాలలో చాల అవకాశాలు వస్తున్నా తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఒప్పుకుంటూ తన కెరియర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ‘గూఢచారి’ విజయం తరువాత రావలసి ఉన్న అతడి ‘2 స్టేట్స్’ హిందీ మూవీ తెలుగు రీమేక్ ఇప్పటికే విడుదల కావలసి ఉన్నా ఆసినిమా ఈ యంగ్ హీరోకు సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ మూవీని రీ షూట్ చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: