దిల్ రాజ్ కలలలో కూడ ఊహించుకొని ఘన విజయాన్ని ఇచ్చిన ‘ఎఫ్‌ 2’ ఒక విషయంలో దిల్ రాజ్ కు మనశ్శాంతిని పోగోడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా జయాపజయాలను ముందుగానే అంచనా వేస్తాడు అని పేరు తెచుక్కున్న దిల్ రాజ్ ‘ఎఫ్‌ 2’ ఈ స్థాయిలో  హిట్‌ అయి బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్ అవుతుందని ఏమాత్రం ఊహించుకోలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. 
f2 Movie | telugu.itsmajja.com
ఈమూవీ అందరి అంచనాలను తలక్రిందులు చేసి దిల్‌ రాజ్ కెరియర్ లోనే అత్యధిక లాభాలు గణించిన సినిమాగా మారడంతో ఈమూవీని ముందుగా బయ్యర్లకు తక్కువ రేట్లకు అమ్మి తప్పు చేసానా అన్న భావనలో దిల్ రాజ్ ఉన్నట్లు టాక్. అయితే ఈమూవీకి సంబంధించిన కొన్ని ఏరియాల హక్కులు తన వద్దనే ఉంచుకోవడంతో బయ్యర్లతో పాటు దిల్ రాజ్ కు కూడ లాభాలు విపరీతంగా వస్తున్నాయి. 
f2 movie teaser: venkatesh, varun tej shows funny frustration
అయితే ఇక్కడ దిల్ రాజ్ చేసిన ఒక అనాలోచిత పని వలన మళ్ళీ తనకు రావలసిన లాభాలకు గండి పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ రన్ మూడు వారాలకు మించి ఉండదని భావించిన దిల్ రాజ్ ఈమూవీ డిజిటల్‌ రైట్స్‌ ను కలిగి ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థను ఈమూవీ విడుదలైన నెలరోజుల తర్వాత స్ట్రీమ్‌ చేసుకోమని వ్రాత పూర్వకంగా వ్రాసి ఇచ్చాడు అని టాక్. 

అయితే ఇప్పటికీ ‘ఎఫ్‌ 2’ కి ఇంకా మంచి కలక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీని ఎగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈనెల 11న ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేస్తే ‘ఎఫ్‌ 2’ ఇక అందరి సెల్‌ ఫోన్ లో కూడ కనిపిస్తుంది. ఇప్పటికీ ఈసినిమా కలక్షన్స్ బాగుండటమే కాకుండా  ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇంకా కలక్షన్స్ రావలసిన ‘ఎఫ్‌ 2’ కి గండి పడినట్లే. దీనితో ముందుగా ఎగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అమెజాన్‌ ప్రైమ్ కు కనీసం యాభై రోజుల కండిషన్స్ పెట్టవలసింది అంటూ దిల్ రాజ్ బాధ పడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: