రాజకీయాల్లో వైఎస్సార్ ప్రస్తానం అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ముప్పయ్యొక్క సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. అయిదేళ్ళ మూడు నెలల పాటు మాత్రమే ముఖ్యమంత్రి గా ఉన్నారు. కానీ తనదైన ముద్ర మాత్రం తెలుగు రాష్ట్రాలలో వేసి వెళ్ళిపోయారు. అటువంటి వైఎస్సార్ జీవితం స్పూర్తి దాయకమే.


ఇక వైఎస్సార్ జీవితంలో ప్రధాన ఘట్టమైన పాదయాత్రను తీసుకుని నిర్మించిన యాత్ర మూవీ  ఈ రోజు విడుదల అయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో ఇప్పటికీ ఈ సినిమాను చూసిన వారు వైఎస్సార్ సూపర్  హిట్ అంటున్నారు. ఆయనలా అచ్చంగా ముమ్ముట్టి అచ్చుగుద్దినట్లుగా ఉన్నారని, ఆ హావభావాలను చక్కగా పలికించారని కూడా అంటున్నారు. 


ఇక వైఎస్‌గా మమ్ముట్టి ఇంట్రీ సీన్‌ని హైలైట్‌గా ఉందని.. ఆ పాత్రలో రాజన్న తిరిగి వచ్చినట్టుగా పరకాయ ప్రవేశం చేశారంటున్నారు. దర్శకుడు సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా చూపించారంటున్నారు. వైఎస్‌ పాదయాత్ర నేపథ్యంలో ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని చాలా ఎమోషనల్‌గా వరుస సీన్లలో దర్శకుడు చూపించారంటున్నారు.


 ఇక మన గడపతొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా లాంటి డైలాగ్స్ అదిరిపోయాయంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌కి సంబంధించిన ప్రజా సంకల్పయాత్ర ఒరిజినల్‌ వీడియో‌లను ఈ చిత్రంలో చూపించారని.. జగన్ ఫ్యాన్స్‌కి పండగే అంటున్నారు. మొత్తానికి చూస్తే వైఎస్సార్ నిబద్ధత, ఆయనలోని అంకితభావం, ధైర్యం, రాజకీయ పయనం అన్నీ గుదిగుచ్చినట్లుగా చూపించడంలో డైరెక్టర్  మహి వి రాఘవ నూరు శాతం న్యాయం చేశారని అంటున్నరు. ఉమ్మడి తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకుని మొత్తం 979 స్క్రీన్స్ టచ్ చేసిన యాత్ర ఓ ఎమోషనల్ జర్నీ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: