త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ నితిన్ తో రాయబారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సితారా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ‘భీష్మ’ మూవీని నితిన్ తో ప్రకటించి చాల రోజులు అయింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించే ఈమూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాకపోవడానికి గల కారణం నితిన్ తన పారితోషికం విషయంలో పడుతున్న మొండి పట్టుదల అని అంటున్నారు. 
Cute Smiling Image Of Nithin
ఈమధ్య కాలంలో నితిన్ నటిస్తున్న సినిమాలు అన్నీ వరస పరాజయాలు అవుతున్నా తన పారితోషిక విషయంలో ఏమాత్రం తగ్గించుకోనని మొండి పట్టుదల పట్టడంతో సితారా ఎంటర్ టైన్మెంట్ సంస్థకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ తో పారితోషికానికి సంబంధించి రాయబారాలు చేస్తున్నట్లు టాక్. దీనికితోడు ‘అ ఆ’ మూవీ నుండి త్రివిక్రమ్ కు నితిన్ తో సాన్నిహిత్యం పెరగడంతో ఇప్పుడు స్వయంగా నితిన్ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగాడు అని తెలుస్తోంది. 
Cool Looking Image Of Nithin
ఇది ఇలా ఉండగా ఈసినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయిన రష్మిక డేట్స్ ను కూడ త్రివిక్రమ్ తాను అల్లు అర్జున్ తో తీస్తున్న కొత్త సినిమాకు ఉపయోగించుకునేలా రాయబారాలు చేస్తూ నితిన్ పారితోషిక విషయంలోనే కాకుండా హీరోయిన్ విషయంలో కూడ రాజీపడే విధంగా త్రివిక్రమ్ నితిన్ పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీనితో త్రివిక్రమ్ మాట కోసం డబ్బును అదేవిధంగా హీరోయిన్ ను నితిన్ వొదులుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
Attractive Movie Still Of Nithin
దీనితో ‘భీష్మ’ చిత్రానికి మరొక హీరోయిన్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఇప్పటికే విజయాలు లేక టెన్షన్ పడిపోతున్న నితిన్ కు రష్మిక గోల్డెన్ లెగ్ అవకాశం కూడ మిస్ కావడంతో ఈమూవీ ఎప్పటికి ప్రారంభం అవుతుందో నితిన్ కే తెలియని పరిస్థుతులు కొనసాగుతున్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: