ఈరోజు విడుదలైన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జీవితానికి సంబంధించిన ‘యాత్ర’ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మంచి జోష్ మీద ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ గా ఈమూవీలో మమ్ముట్టి ఒదిగిపోయి చేసిన నటనకు విమర్శకుల నుండి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. 
తూటాల్లా పేలి.. భావోద్వేగాని గురిచేసిన డైలాగ్స్
ఈమూవీకి కథా కధనం ప్రాణంగా నిలవడంతో పాటు ఈమూవీ చివర్లో వైఎస్ మరణం నేపథ్యంలో పెంచల్ దాస్ పాట భావోద్వేగంగా ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్న నేపధ్యంలో ఈమూవీ సూపర్ హిట్ అన్న ప్రాధమిక టాక్ వస్తోంది. వివాదాల జోలికి పోకుండా సినిమాకు కావాల్సిన ఫీల్‌ గుడ్ అంశాలను ఎంచుకోవడంలో మహీ. వి. రాఘవ విజన్ ‌బయటపడటంతో సరిగ్గా తీస్తే బయోపిక్ మూవీలకు విజయం తథ్యం అన్న అంశం మరొకసారి రుజువైంది. 
సూర్యన్ సినిమాటోగ్రఫి
ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి వస్తున్న పాజిటివ్ టాక్ ఖచ్చితంగా బాలకృష్ణ ‘మహానాయకుడు’ పై ప్రభావం చూపెడుతుంది అని అంటున్నారు. ఈ సినిమాను బాలకృష్ణ సొంతంగా నిర్మించడమే కాకుండా అన్నీ తానై వ్యవహరించి కేవలం ‘యన్.టి.ఆర్’ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు’ థియేట్రికల్ రైట్స్ 70 కోట్లకు అమ్మడం సంచలనంగా మారింది. అయితే ఈమూవీ కొనుక్కున్న బయ్యర్లకు 50 కోట్ల నష్టం వచ్చిన నేపధ్యంలో ఆ నష్టానికి ప్రతిఫలంగా ఉచితంగా ‘మహానాయకుడు’ ను ఇస్తానని అంటున్నా ప్రస్తుతం ‘యాత్ర’ కు వచ్చిన టాక్ రీత్యా సంచలనాలు లేని ‘మహానాయకుడు’ మూవీని విడుదల చేసినా ధియేటర్ల రెంట్ కూడ రాదేమో అన్న అనుమానాలు ‘కథానాయకుడు’ ను కొనుక్కున్న బయ్యర్లకు కలుగుతున్నట్లు టాక్.
విజయమ్మగా అశ్రిత వేముగంటి
దీనితో ‘కధానాయకుడు’ ను కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లకు బాలకృష్ణ ఎంతోకొంత చేతి నుంచి పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ‘మహానాయకుడు’ మూవీని సక్సస్ చేయాలి అంటే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన కొన్ని సంచలన సంఘటనలు పెడదాము అని క్రిష్ సలహాలు ఇస్తున్నా బాలయ్య పట్టించుకోని పరిస్థుతులలో ఈమూవీకి ఆశలు క్రేజ్ ఏర్పడుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు ఈరోజు విడుదలైన ‘యాత్ర’ కు మంచి టాక్ రావడంతో ‘మహానాయకుడు’ లో మెప్పించే సన్నివేశాలు లేకపోతే ఈమూవీని విజయంతం చేయడం కష్టమే అన్న వాస్తవాన్ని బాలకృష్ణ గుర్తించినట్లు తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: