ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ రిలీజ్ అయ్యింది ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం మనం చూశాము. అయితే రాజశేఖర్ రెడ్డి మీద తీసిన బయో పిక్ ''యాత్ర''  ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషన్స్‌ ఎంత పండితే, వాటితో ప్రేక్షకులు ఎంత కనక్ట్‌ కాగలిగితే సదరు దృశ్యాలు అంత పండుతాయి అనిపించే సన్నివేశాలు సుదీర్ఘంగా వున్నాయి. మమ్ముట్టి అద్భుతమైన అభినయానికి తోడు, ఆయా సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం వాటిని చాలా ఎఫెక్టివ్‌గా తెరమీదకి తీసుకొచ్చింది. వృద్ధాప్య పించన్లు అందని వృద్ధులు తమ గోడు వెళ్లబోసుకునే సన్నివేశంలో 'ఊళ్లో పది మందికే నెలకి డెబ్బయ్‌ అయిదు రూపాయల పించను వస్తోంది. ఆ పది మందిలో ఒకరు పోతే మనకి ఆ డబ్బులొస్తాయని మరొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వస్తోంది' లాంటి కదిలించే సంభాషణలు ఇన్‌స్టంట్‌గా టచ్‌ చేస్తాయి.

Image result for yatra telugu movie

మరో సన్నివేశంలో మాట్లాడలేకపోతున్న 'రైతు' గోడు వింటోన్న రాజశేఖరరెడ్డితో 'అతను మాట్లాడలేడు' అని డాక్టర్‌ చెబుతోంటే... 'నాకు వినబడుతోందయ్యా' అనడం.. 'నేను విన్నాను, నేనున్నాను' అంటూ రైతులకి భరోసా ఇవ్వడం లాంటి సన్నివేశాల్లో డ్రామా చక్కగా పండింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తక్కువ మాటలతో ఎక్కువ అర్థాన్ని, భావోద్వేగాన్ని పలికించిన తీరు మెప్పిస్తుంది. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం వెనుక ఒక కథని మహి చెప్పాడు. కొన్ని సందర్భాల్లో మెలోడ్రామా మితి మీరినా కానీ రాజశేఖరరెడ్డి మనోభావాలకి దృశ్య రూపం ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

Image result for yatra telugu movie

అయితే ఈ చిత్రాన్ని టోటల్‌గా వన్‌సైడెడ్‌గా తీసేయడం, రాజశేఖరరెడ్డిలోని నెగెటివ్స్‌ని అన్యాపదంగా మాత్రమే ప్రస్తావించడం, ఆయన గతం జోలికి గానీ, తనపై వున్న ఆరోపణల వైపు కానీ వెళ్లకపోవడం అందర్నీ మెప్పించలేకపోవచ్చు. ముఖ్యంగా హైకమాండ్‌ని కమాండ్‌ చేసే నాయకుడన్నట్టు చూపించడం, ఆయన ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయలేదన్నట్టుగా చిత్రీకరించడం సినిమాటిక్‌గా వైఎస్‌ని ఎలివేట్‌ చేయడానికి ఉపయోగపడినా కానీ వాస్తవాతీతంగా అనిపిస్తుంది. అయితే సదరు సన్నివేశాల్లో వైఎస్‌ డైనమిజమ్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీపై సెటైర్లు కూడా బాగానే పేలాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: