అన్నగారి సినీ జీవితం మీద తీసిన మూవీ కధానాయకుడు. మరో వైపు మహా నేత వైఎస్సార్ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాని ఆధారం చేసుకుని తీసిన మూవీ యాత్ర. కేవలం నెల తేడాలో ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు మూవీస్ మీద జనాభిప్రాయం, వచ్చిన టాక్ అన్నడి ఇక్కడ చాలా ముఖ్యమైనది.


ముందుగా అన్న గారి మూవీ కధానాయకుడు తీసుకుంటే అందులో అంతా ఒక పద్ధతిలో స్క్రీన్ ప్లే రెడీ చేసుకుని ముందుకెళ్ళినట్లుగా అనిపించింది. అన్న గారిని దైవాంశ సంభూతునిగా ఆ మూవీలో చూపించడం జరిగింది. సినిమా రంగంలో అన్న గారు అనేక దేవుడి పాత్రలు పోషించిన ఉత్తమ కళాకారుడు. అయితే ఆయన కూడా అతి సామాన్యుడే. సాదా సీదా జీవితం నుంచి మాత్రమే ఆయన మద్రాస్ వెళ్ళి ఉన్న‌త నటుడిగా వెలుగొందారు. ఆ విధంగా ఓ సామాన్యుడు అందరు మెచ్చే కళాకారుడు ఎలా అయ్యాడన్నది చూపించి  ఉంటే బాగుండేది. 


కానీ అలా కాకుండా నేల విడిచి సాము చేసినట్లుగా ఆ చిత్రాన్ని తీయడం తోనే కనెక్షన్ ఎక్కడో తప్పినట్లుగా జనం భావించారు. అందుకే  అందులో ఎమోషన్ ఏమీ లేకపోయింది. పైగా అన్న గారు అంటే అది కచ్చితంగా జరుగుతుంది అన్న తీరులో ఫిల్మ్ మేకర్స్ మూవీని తీశారనిపించింది. అందువల్ల ఆ మూవీతో పాటుగా ప్రేక్షకుడు ట్రావెల్ చేయలేకపోయాడనిపిస్తుంది. నిజానికి అన్న గారి విజయాలను ఓ స్పూర్తిగా తీసుకుని తీర్చిదిద్దితే బాగా  అప్లాజ్ వచ్చేదేమో. ఎవరైనా క్రుషి పట్టుదల ఉంటే అలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునన్న సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యేది. కానీ ఎక్కడో ట్రాక్ తప్పేశారు. ఒక్క నందమూరి వారికి మాత్రమే అది జరుగుతుందని, ఆయన అనితర సాధ్యుడని, దేవుడని చెప్పడంతోనే అసలు చిక్కు వచ్చింది. అది ఆ సినిమాకు మైనస్ అయింది


ఇక యాత్ర గురించి ఇపుడు చెప్పుకుందాం. యాత్ర మూవీ అన్నది ఓ మామూలు మనిషి జీవితంగానే చెప్పారు. ఇక్కడే దర్శకుడు తన  దా ర్శనీయత చూపించాడు. ఓ సామాన్య వైద్యునిగా ఉన్న వ్యక్త్రి ప్రజా జీవితంలోకి ఎలా వచ్చారు. ఆ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలేంటి. ఆయన వాటిని ఎలా ఎదుర్కొన్నారు. ఇక ఆయన ఓ మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాల మధ్య ఎలా నెగ్గుకువచ్చారు ఇలాంటివి అన్నీ వివరించిన తీరు యాత్ర సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. 


అంతే కాదు, వైఎస్సార్ జీవితంలో అతి ముఖ్య ఘట్టం అయిన పాదయాత్రను బాగా మలచారు. అసలు ఆ ఆలోచన రావడం వెనక ఉన్న కారణాలు, ఆంతర్యం వంటివి బాగా చూపించారు. యాత్ర మొదలుకాక ముందు, యాత్రలో ఉన్నపుడు, పూర్తి అయ్యాక వైఎస్సార్ లో వచ్చిన మార్పును కూడా చక్కంగా చూపించగలిగారు. పేదల పట్ల ఓ నాయకుడికి ఉండాల్సిన తపన, నిబధ్ధత, పట్టుదల వంటిన్వి ఈ సినిమాలో చూపించారు. ఇక అతి సామాన్యుడు అసమాన్యుడు ఎలా అయ్యాడన్నది చూపిస్తూ సాగిన ఈ మూవీ ఓ ఎమోషనల్ ట్రావెల్ గా సాగిపోయింది. 


అందుకే ఈ సినిమాతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతున్నారనిపిస్తోంది.  ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడమే కాదు. చక్కని రేటింగ్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీలో దర్శకుని ప్రతిభకు, సీనియర్ నటుడు మమ్ముట్టి నటనకు ఐమాక్స్ ధియేటర్లలో విజిల్స్ వస్తున్నాయంటేనే ఈ మూవీ విజయం ఏంటన్నది చెప్పకనే చెబుతోంది. మొత్తానికి తెలుగు జాతి గర్వించతగిన ఇద్దరు మహనీయుల జీవిత ఘట్టాల  గురించి చెప్పాలనుకున్నపుడు ఎలా చెబితే జనాదరణ వస్తుంది, లేకపోతే రాదు అన్నది తెలియడానికి ఈ రెండు మూవీస్ కళ్లకు రెండు ఎగ్జాంపుల్స్ గా చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: