అదేదో సినిమాలో హీరోయిన్ మహేష్ అంటూ కలవరిస్తుంది. మహేష్ లాంటి అందగాన్నే చేసుకుంటానంటోంది. ఆ పేరులోనే o వైబ్రేషన్ ఉందని అంటుంది. నిజమే మరి మహేష్ పెళ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రి అయినా, నలభయి పడిలో పడినా పెళ్లి కాని అమ్మాయిల ఓట్లు ఆయనకే. కళల రాకుమారుడు మహేష్ అంటే నో డౌట్.


మరి మహేష్ మానియా మాములుగా లేదు.  అందుకే ప్రఖ్యాత మేనపు బొమ్మల మ్యూజియమ్‌ మేడమ్‌ టుస్పాడ్స్‌(లండన్‌)లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మైనపు బొమ్మను చాలా రోజుల క్రితమే ఏర్పాటు చేశారు. దాంతో మహేష్ కీర్తి ఎక్కడికో వెళ్ళిపోయింది  రేర్ రికార్డ్ ని మహేష్ అలా క్రియేట్ చేసారు.

 

 ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఈ వ్యాక్స్‌ స్టాచ్యూను త్వరలో భాగ్యనగరానికి ఒకరోజు సందర్శనార్ధం తీసుకురానున్నారని తెలిసింది.మహేష్‌బాబుకు భాగస్వామ్యం ఉన్న ఎఎంబీ సినిమాస్‌ మల్టిఫ్లెక్స్‌లో ఈ మైనపు బొమ్మను ఒక రోజు పాటు ఉంచాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే సింగపూర్‌ నుంచి ప్రస్తుతం ఆ మైనపు బొమ్మను  ఎలా జాగ్రత్తగా ఇక్కడకు తీసుకురావాలి మళ్లీ బొమ్మకు ఏమాత్రం డ్యామేజ్‌కాకుండా తిరిగి సింగపూర్‌కు తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచాలి అనే దిశగా ప్లాన్‌ చేస్తున్నారు.. వాళ్ల షెడ్యూల్‌ కనుక షైనల్‌ అయితే సూపర్‌స్టార్‌ మైనపుబొమ్మ ను ఏతేదీన ఇక్కడ సంద్శనార్ధం ఉంచుతారనే విషయం వెల్లడిస్తారట..

 

అభిమానులకు ఇదినిజంగానే గొప్ప వార్త.. సందర్శన పూర్తయిన తర్వాత మైనపు బొమ్మను తొలుత సింగపూర్‌కు తీసుకెళ్తారని, అక్కడనుంచి మేడమ్‌ టుస్పాడ్స్‌ మ్యూజియం ప్రధాన కార్యాలయం ఉన్న లండన్‌కు తరలిస్తారని తెలిసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: