ఇండస్ట్రీ లో ఒక్క ఫ్లాఫ్ తమ కెరీర్ నే మార్చేస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి బోయాపాటికి వచ్చిందని చెప్పాలి. మొన్నటిదాకా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఉన్న బోయపాటి.. ఇప్పుడు అందరికీ చేదైనట్లుగా కనిపిస్తున్నాడు. తెలుగు సినిమా ట్రెండ్ మారి అందరూ కొత్తదనం వైపు అడుగులేస్తున్న సమయంలో బోయపాటి మాత్రం ఫార్ములా సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగాడు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే.. ఇలాంటి రొటీన్ కథలతో సినిమాలు చేసేవాళ్లకు గట్టిగా ఒక ఎదురు దెబ్బ తగిలితే చాలు.. మొత్తం కథ మారిపోతుంది.


ఒక్క ఫ్లాప్ బోయపాటికి ఎన్ని తలనొప్పులు తెస్తుంది ...!

ఇందుకు ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. తాజాగా ఈ కోవలోకి బోయపాటి చేరినట్లుగా కనిపిస్తున్నాడు.ఇకపై బోయపాటి ఎంతమాత్రం రొటీన్ కథలతో సినిమాలు తీస్తే వర్కవుటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బాలయ్య ఎంత మాస్ హీరో అయినప్పటికీ.. ఆయనతో కూడా ఏదో కొంచెం డిఫరెంటుగానే ట్రై చేయాలి. ‘వినయ విధేయ రామ’తో బోయపాటి ఇమేజ్ మామూలుగా డ్యామేజ్ కాలేదు. ఈ స్థితిలో మామూలు సినిమా తీసి మెప్పించడం కుదరదు.

Image result for boyapati srinu

ఏదో ప్రత్యేకంగా ట్రై చేయాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో పని చేస్తాడన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో కయ్యం పెట్టుకుంటే.. మనుగడ కష్టమవుతుంది. ఎవ్వరూ ఓపెన్‌గా చెప్పరు.. ఏమీ చెయ్యరు కానీ.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ‘వినయ విధేయ రామ’ బయ్యర్లకు నష్టపరిహారం అందించే విషయంలో బోయపాటి వ్యతిరేకత ప్రదర్శించడం, చరణ్, దానయ్యలతో కయ్యం పెట్టుకోవడం అతడికి చేటు చేసేదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: