వైఎస్ బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా శుక్రవారం రిలీజైంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. మమ్ముట్టి లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా వైఎస్ కు గొప్ప నివాళి అందించేలా తీశారు.


సినిమా అన్నిచోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.. రాజన్న జీవితాన్ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారని అంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల మీద యాత్ర ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద చర్చలు మొదలయ్యాయి. యాత్ర సినిమా వల్ల వైఎస్ అభిమానులకు నూతనోత్సాహం వచ్చింది.


ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో మమేకమై ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వారికి దగ్గరైన జగన్ ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. యాత్ర హంగామా దానికి మరింత ఊపందించేలా చేసింది.


రాబోయే ఏపి ఎలక్షన్స్ ఈసారి టఫ్ ఫైట్ జరుగనుందని తెలుస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షితులను చేసేలా చూస్తున్నారు. ఎలక్షన్ కోడ్ రావడమే ఆలస్యం ఇక ప్రచార పర్వంలో ప్రజల మనసులు గెలిచేందుకు షెడ్యూల్ ప్రారంభిననున్నారు. పాదయాత్రతో సిఎం అయిన వైఎస్సార్.. ఆ హిస్టరీ రిపీట్ చేస్తూ సంకల్ప యాత్ర చేసి ప్రజల్లో జగన్ ఏర్పరచుకున్న ఈ నమ్మకం ఈసారైనా అతనికి అధికారం కట్టబెట్టేలా చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: